రణస్థలం మండలం జే.ఆర్.పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీ నివాసి తిప్పాన వెంకట సత్యం,వయస్సు 50 సంవత్సరాలు. చిరు వ్యాపారం చేసుకుంటూ భార్యా ముగ్గురు కుమార్తెలతో అద్దెఇంట్లోనే ఏదోలా జీవనం కొనసాగిస్తున్నాడు.ఆ కుటుంబం మీద కాలం పగబట్టిందో ఏమో వెంకట సత్యంకు గొంతు కేన్సర్ వచ్చింది. రెక్కడితేగాని డొక్కాడని ఆకుటుంభం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకుంటున్నా రోజు గడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.ఆ పేద కుటుంబాన్ని శ్రీ ఇడదాసుల విద్యా ఆరోగ్య సేవ ఫౌండేషన్ తరుపున దాతల ద్వారా రూ.65,111 విరాళం సేకరించి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా బాధితుడుకు అందజేశారు. ఇందులో భాగంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్10,000వేలురూపాయలు మిగతా ఫౌండేషన్ సభ్యులు 55,111రూపాయలు అందజేసి ధాతృత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపీటీసి తిరుపతిరాజు,మేమున్నాం సేవా సంఘం అధ్యక్షులు పచ్చిగుళ్ల సాయిరాం,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దన్నాన సీతారాం,తదితరులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర న్యూస్ బుజ్జి..