కర్నూలు జిల్లా మంత్రాలయం లోఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలోని 27 లక్షల 60 వేల మహిళల పేరిట ఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్ధం చేసి మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచారని వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షులు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి అన్నారు. రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టి. భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ గోరుకల్లు కృష్ణ స్వామి, ఎంపిటిసి సభ్యులు పులికుక్క రాఘవేంద్ర నాయకులు మల్లికార్జున, శివ కుమార్, హోటల్ పరమేష్ స్వామి, వీరయ్య శెట్టి, దామోదర్ గుప్తా, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజా నేత్ర రిపోర్టర్ v. నరసింహులు.