- త్రిపురలోని పందుల ఫామ్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ గుర్తింపు
- పరిస్థితిని అంచనా వేస్తున్న ఒక నిపుణుల బృందం
- ఫామ్ లో చనిపోయిన 63 పందులు
మరోవైపు ఆఫ్రికన్ స్వైన్ నిర్ధారణ అయిన పందులన్నింటినీ చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. వీటిని 8 అడుగుల లోతైన గుంతలో పాతిపెట్టనున్నారు. ఆ షెడ్డులో 265 పందులు, 185 పంది పిల్లలు ఉన్నాయి. వీటిలో 63 పందులు గుర్తు తెలియని కారణాలతో చనిపోవడంతో… వాటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అని తేలింది.