ప్రజనేత్ర న్యూస్ కోసిగి మంత్రాలయం నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం మంత్రాలయం మండలంలోని పరమాన్ దొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల ఇంచార్జ్ మురళీ మోహన్ రెడ్డి గార్ల చేతుల మీదుగా మండలంలోని చిర్తనకల్ గ్రామానికి చెందిన ఆడపడుచులకు పంపిణీ చేయడం జరిగింది.చిర్తనకల్ గ్రామానికి 95 పట్టాలు మంజూరు కావడం జరిగిందని తాహాశీల్దార్ రుద్రగౌడ్ తెలిపారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ బెట్టన్నగౌడ్, మండల నాయకులు శ్రీనివాస రెడ్డి,నాడిగేని నాగరాజు, నరసింహులు గౌడ్, బసిరెడ్డి,గ్రామ నాయకులు ఈరన్న,హనుమప్ప,విజయ్ బాస్కర్,రామిరెడ్డి,మారెన్న తదితరులు పాల్గొన్నారు.