Zero Budget Politics స్టేట్ లో జీరో బడ్జెట్ పాలిటిక్స్
Zero Budget Politics: Pilot project in 31 Assembly constituencies
జీరో బడ్జెట్ పాలిటిక్స్: 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్..?
When politics decides everything in your life, decide what your future politics should be
మీ జీవితంలో ప్రతిదీ రాజకీయమే నిర్ణయిస్తున్నప్పుడు, మీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. ఖరీదయిన కార్పొరేట్ రాజకీయ శక్తులను అడ్డుకొని సామాన్యులు అధికారం పొందే దిశగా ‘ప్రవాసీ పార్టీ’ ముందుకు వస్తున్నది. మీకున్న సమయంలో కొద్దిభాగాన్ని కేటాయించండి. సామాజిక మార్పు కోసం.. రండి.. రాజకీయాల్లోకి. ‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ నినాదం స్పూర్తితో… రాజకీయాల్లో మార్పు కోసం, తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతగా ‘పైలట్ ప్రాజెక్ట్’ క్రింద ఈక్రింది 31 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేయాలని మా నిపుణుల బృందం సూచించింది. ఈ విషయమై మా కోర్ కమిటీ క్షేత్ర స్థాయిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో పర్యటిస్తుంది.
ఆదిలాబాద్ (ఎస్టీ) లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు: 1. ఆదిలాబాద్, 2. నిర్మల్, 3. ముధోల్, 4. సిర్పూర్, 5. ఖానాపూర్ (ఎస్టీ), 6. ఆసిఫాబాద్ (ఎస్టీ), 7. బోథ్ (ఎస్టీ) కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు: 1. కరీంనగర్, 2. వేములవాడ, 3. సిరిసిల్ల, 4. హుజురాబాద్, 5. హుస్నాబాద్, 6. చొప్పదండి (ఎస్సీ), 7. మానకొండూర్ (ఎస్సీ)నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు: 1. నిజామాబాద్ (అర్బన్), 2. నిజామాబాద్ (రూరల్), 3. బోధన్, 4. బాల్కొండ, 5. ఆర్మూర్, 6. కోరుట్ల, 7. జగిత్యాల. పెద్దపెల్లి (ఎస్సీ) లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు: 1. పెద్దపెల్లి, 2. రామగుండం, 3. ధర్మపురి (ఎస్సీ)జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు: 1. యెల్లారెడ్డి, 2. కామారెడ్డి, 3. నారాయణ్ ఖేడ్ మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు: 1. దేవరకద్ర, 2. మక్తల్ వరంగల్ (ఎస్సీ) లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం: 1. భూపాలపల్లి సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం: 1. జూబ్లీహిల్స్
మంద భీంరెడ్డి, రచయిత
98494 22622