ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బీజేపి-బీఆర్ ఎస్ ల మధ్య ఇంకా ముదురుతునే ఉంది.
ఆ కేసును సిట్ దర్యాప్తు చేస్తుటే తమకు నమ్మకం లేదని బీజేీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ దశలో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ అతి ఉత్సహం ఈ కేసు మలుపుకు కారణమైంది. సిట్ వద్ద ఉండే రహాస్యలను సీఎం చెప్పడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీబీఐకి అప్పగించాలని తీర్పు ఇచ్చింది.
అయితే.. ఈరోజు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అప్పీలు దాఖలు చేసింది ప్రభుత్వం. సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసింది ప్రభుత్వం.
ప్రభుత్వ అప్పీలుపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు.