ఏపీ 39 టీవీ,
ఏప్రిల్ 13
కనేకల్:- అనంతపురం డిస్ట్రిక్ట్ స్క్వాడ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ధనంజయ గారి ఆధ్వర్యంలో కనేకల్ SEB CI D. సోమశేఖర్ మరియు సిబ్బంది బొమ్మనహల్ మండలం కలవల్లి తిప్ప గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేయుచుండగా శరత్ బాబు ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన వ్యక్తి మరియు శ్రీరాములు అను బూదగవి గ్రామానికి చెందిన వ్యక్తి ఇద్దరూ తమ ద్విచక్రవాహనాలపై కర్ణాటకకు చెందిన 16 బాక్సులు యందు గల Haywards Cheers Whisky 90 ml ప్యాకెట్స్ మొత్తం 1536 టేట్రా పాకెట్స్ రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి సదరు ద్విచక్ర వాహనాలు మరియు ప్రాపర్టీని అరెస్టు చేసి రాయదుర్గం JFCM కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ గారు రిమాండ్కు ఆదేశించడం అయినది. ఈ కార్యక్రమంలో SEB అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ధనంజయ కనేకల్ స్టేషన్ CI సోమశేఖర్ అనంతపురం DTF సీఐ మారుతీరావు PC లు మారుతి ప్రసాద్ నారాయణస్వామి నాగరాజు రఫీ పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జ్.