అఖండమైన మెజారిటీతో వైఎస్ఆర్సిపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదే – ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి
అఖండమైన మెజారిటీతో వైఎస్ఆర్సిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మనందరి మీదా ఉంది… ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి .
బుక్కరాయసముద్రం మేజర్ పంచాయతీ స్టేట్ బ్యాంక్, బోయ వీధి, ఫెర్రర్ కాలనీ, ఓల్డ్ ఎస్సీ కాలనీ, న్యూ ఎస్సీ కాలనీ ,గౌరయ్య కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి ఏ పార్వతి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పినట్లు అమలు చేసి ప్రజల చెంతకే అందజేస్తారని మనం కూడా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి జగనన్న బహుమానంగా చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలు అయినా రోడ్డుకు నడి రోడ్డు పక్కన ఉన్న అనంతసాగర్ చెరువుకు నీళ్లు ఇవ్వడమే కాకుండా మరువ పారే విధంగా నీళ్లు ఇచ్చామని రాబోయే రోజుల్లో అనంతసాగర్ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రజలకు తెలియజేశారు.
అలాగే ఇస్లాంపూర్ కాలనీ, గాంధీనగర్ అండర్ డ్రైనేజీ కూడా పూర్తి అయిందని ప్రజలకు తెలియజేశారు.
బుక్కరాయసముద్రం మండల ప్రజలు అత్యంత ఆరాధ్యదైవంగా పూజించే శ్రీ కొండమీద రాయుడు స్వామివారికి కొండమీదకు బిటి రోడ్లతో గత కొన్ని నెలల కింద భూమి పూజ కూడా చేశామని ఇప్పుడు రాబోయే తిరునాళ్లకు పూర్తి అవుతుందని ప్రజలకు గుర్తు చేశారు. అంతేకాకుండా మీ పంచాయితీలో రోడ్లు మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే సర్పంచ్ అభ్యర్థి ఏ పార్వతి గారికి అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని పద్మావతి ప్రజలకు తెలియజేశారు.