Gamanam Movie Review గమనం సినిమా రివ్యూ
Gamanam Movie Review
గమనం సినిమా రివ్యూ
ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుంచీ ఎదురు చూసిన ఈ సినిమా కోసం. ఇవాళ తీరింది. Amazon prime లో.
ఏదో నార్మల్ గా తీసి ఉండొచ్చులే అనుకున్నాను.
కానీ , ఒక్కో సన్నివేశం ఒక్కో అధ్యాయం..
అసలు ఇందులోని నటీనటులు ఈ సినిమా కోసం ఇంత బాగా perform చేసిన్రా ? లేక వీళ్ళ ప్రతిభను రాబట్టుకోవడంలో దర్శకురాలు వందశాతం సఫలం అయిందా అన్న అనుమానం వస్తుంది.
హీరోయిన్ అంటే పాటకి రెండు నిమిషాల ముందు ప్రత్యక్షమై , పాట అయిపోగానే కనబడకుండా పోయే పాత్రలతో కెరీర్ ను కొనసాగించి రెండు దశాబ్దాల పాటు నిలబడ్డ శ్రేయా గారికి ఇందులో గర్వించదగ్గ పాత్రనే.
ప్రియాంక జువాల్కర్ కు తాను నటిగా నిరూపించుకోడానికి దొరికిన చక్కని అవకాశం.
ఆ తర్వాత అసలైంది
ముఖ్యమైంది
నాకు బాగా ఇష్టంగా అనిపించింది బుడ్డోడి పాత్ర.
అసలు ఆ పిల్లవాడి నటన మనల్ని ఎంతగా కట్టిపడేస్తుందంటే….
వాడు జీవించిండు.
నాకు వాణ్ణి ఎత్తుకుని తనివితీరా గాల్లో గిరగిరా తిప్పి ముద్దు పెట్టుకొని కేరింతలు కొట్టాలనిపించింది.
సినిమాలో
వరద నీటిలో మునుగుతున్న ఇంట్లో
బిడ్డతో సహా ఇబ్బంది పడుతున్న శ్రెయా కి
మరియు
అదే వర్షంలో తిరుగుతూ కేక్ కొనటం కోసం
వినాయకుడి బొమ్మలు అమ్మే ప్రయత్నం లో ఉన్న బుడ్డోడికి
మధ్య నటనలో ఒక పోటీలాగా అనిపిస్తుంది . నా మార్కులు బుడ్డోడికే….😀
ఇక యువకుడి పాత్ర.
పరిస్థితులతో పోరాడి చనిపోయిన పాత్ర చిత్రణ చాన బాధాకరంగా అనిపిస్తుంది.
ఎటొచ్చీ బుడ్డోడు సూపర్.
పనికిమాలిన పంచ్ డైలాగులు
గుద్దితే ఎగిరిపోయే దరిద్రపు ఫైటింగ్ లు
అందాల అడ్డదిడ్డపు ఆరబోతలు
హీరోయిజం బిల్డప్
లాంటి చెత్తాచెదారం లేని
ఇటువంటి సినిమాలు జనాలకు నచ్చవు.
నడవవ్.
మంచి emotions తో నిండి , కంట తడి పెట్టిస్తుంది .
(నా కళ్ళు తడి కావు😀)
దర్శకురాలు సుజనా రావు గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.
బుడ్డోడి పాత్ర మాత్రం భలే తీసింది…..😀