Header Top logo

BJP-TRS political war ప్రధానికి లేఖ రాసిన మాజీ మంత్రి

BJP-TRS political war

Former Minister who wrote a letter to the Prime Minister
రైతులు ఘోష వినిపించుకొండి

ప్రధానికి లేఖ రాసిన మాజీ మంత్రి

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రైతాంగం ధాన్యం సమస్య పరిష్కారం మార్గం దొరుకడం లేదు. రాజకీయ లబ్ది కోసం ఇరు పార్టీలు చేస్తున్న పొలిటికల్ ఆరోపణలు, పత్యార్యోపణలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, రైతు బిడ్డ మండవ వెంకటేశ్వర్ రావు రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేరు వేరుగా లేఖలు రాసారు. ఆ రైతుల ధాన్యం కొనుగోలు చేయడానికి పరిష్కార మార్గాలను సూచించారు.

BJP-TRS political war బీజేపీ-టీఆర్ ఎస్ పొలిటికల్ వార్

శ్రీయుత గౌరవనీయులైన నరేంద్ర మోది, ప్రధాన మంత్రి గార్కి

విషయం:- రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయడం గురించి..

ఆర్యా..

రాత్రింబగళ్లు కష్ట పడి  సాగు చేసిన రైతాంగం ఆగమైతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వాల ప్రత్యారోపణలతో రైతాంగాన్ని అయోమయానికి గురి చేస్తోంది.  రైతులు బలి కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. వరి పంట ఎందుకు సాగు చేస్తున్నారు..? లాభాలు ఎక్కువగా ఉన్నాయా..? ఇతర పంటలు ఎక్కువ లాభాలు లేవా..? మరీ  ఇతర పంటలు ఎందుకు వేయడం లేదు. ఎందుకంటే.. ఒక ఎకరం వరి పంట సాగు చేస్తే రైతుకు ఆరు నెలలకు 20 నుంచి 25 క్వింటాల్స్ వరకు ధాన్యం దిగుమతి వస్తోంది. ఆ పంట కూడా అటు పోట్లను తట్టుకుని సక్రమంగా పండితెనే ఆ దాన్యం వస్తోంది.

ఒక ఎకరం వరి పంట సాగు చేయడానికి విత్తనాలు, దుక్కి దున్నడం, వరి నాట్లకు, ఎరువులు, పురుగుల మందు,  వరి కోత మొదలగు అన్నీ కలిపితే ఎకరానికి 30 వేల ఖర్చు వస్తోంది. ఎకరం వరి ధాన్యం విక్రయిస్తే 40 నుంచి 50 వేల వరకు ఆదాయం రావచ్చు. అంటే.. ఖర్చులు 30 వేలు పోను 10 నుంచి 20 వేలు మాత్రమే మిగులుతుంది. రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు రైతులు మాత్రమే ఎక్కువగా ఉన్నారు.

ఎకరానికి ఎవరేజ్ గా నెలకు 15 వేలు చొప్పున ఆరు నెలలకు వరి పంటకు ఆధాయం. రైతుల నెలసరి ఆధాయం 15 వేలు మాత్రమే. రాష్ట్రంలో 60 శాతం రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. వరి పంట సాగులో ఆదాయం మాములుగానే ఉంది. కానీ.. వరి పంటను ఎందుకు వేయాలనుకుంటున్నారు..? తరతరాలుగా వరి పంట సాగు చేస్తున్నారు. ఆ పండించే పంటపై రైతులకు భరోసా ఉంటుంది. మార్కెట్ లో వరి ధాన్యంకు కనీష ధర దొరుకుతుందనే నమ్మకం ఉంటుంది.

ఎన్నో ఏళ్లుగా వరి పంట సాగు చేస్తున్న రైతాంగం మెట్ట పంట పండించడానికి ఉత్సహం చూపడం లేదు. కారణం..? వరి పంటలు పండించే భూములలో మెట్ట పంటకు అనుకూలం కాదు. మెంట పంట అనిఛ్చితమైన  పంట, సరి అయిన విత్తనాలు లభించక పోవడం, వ్యవసాయ పనులు చేయడానికి కూలీల సమస్య తీవ్రంగానే ఉండటం, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, భీహార్, కలకత్తా, నేపాల్ ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించి పని చేయించుకోవాల్సి వస్తోంది. ఆ కూలీలకు మెట్ట పంట సాగు చేయడంలో అనుభవం లేక పని చేయలేక పోతున్నారు.

మెట్ట పంటలకు ప్రాజెక్ట్ కింద, చెరువుల కింద, కెనాల్స్ కింద నీటి యజమాన్యం కష్టం. నీళ్లు ఎక్కువైతే పంటలు నష్ట పోవాల్సి వస్తోంది.  పక్షులు, కోతులు, పందుల నుంచి పంటను రక్షించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అకాల వర్షాలు వచ్చినా.. గాలి వచ్చినా తీవ్ర నష్టం రైతులకే. ఇవన్నీ దాటి పంట పండించిన రైతుకు హెచ్చుతగ్గు మార్కెట్ లతో గిట్టుబాటు ధర ఉంటుందనే నమ్మకం లేదు.

బాయిల్డ్ – రా రైస్..  

తెలంగాణలో ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితిలో రబీ పంటలో నూకలు ఎక్కువగా అవుతాయి. ‘‘బాయిల్డ్ రైస్’’ కంటే నూకలు 13 కిలోలు ఎక్కువై,  రా రైస్ దిగుబడి తగ్గుతుంది. కనుక రైస్ మిల్లర్ లు రా రైస్ కు ధాన్యం తీసుకోవడం లేదు. దేశంలో బాయిల్డ్ రైస్ కేరళ, తమిళనాడు లాంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే తింటారు. దేశంలో ప్రతి ఏడు 35 లక్షల టన్నుల  ఆహారం మాత్రమే వాడుతారని. కానీ.. ఇప్పటికే ఎఫ్ సీ ఐ వద్ద 100 లక్షాల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ నిలువలు ఉన్నట్లుగా అధికారులు చెబుతూ అందుకే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయలేక పోతున్నమంటున్నారు. కనుక బాయిల్డ్ రైస్ లో కొంత ఎక్స్ పోర్ట్ చేయించినచో నిలువల భారం తగ్గి తాజా బాయిల్డ్ రైస్ వినియోగదారులకు ఇవ్వగలం.

పి డి ఎస్..

పేద ప్రజలకు వరదాయినైనా ఉపయోగపడే రేషన్ బియ్యం పథకం ప్రభుత్వాల నిర్లక్ష్యం, కొందరు నాయకులు, కొందరు అధికారుల అవినీతితో పక్కదారి పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కిలో బియ్యం 42 రూపాయలకు (కిలో బియ్యం 34 రూపాయలకు కొనుగోలు చేసి 8 రూపాయల పాలన ఖర్చు మొత్తం రూ.లు 42 ) కొనుగోలు చేసి రాష్ట్రాలకు 3 రూపాయలకు బియ్యం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే లబ్దిదారులకు 1 రూపాయికి ఇస్తోంది.

అందులో కొంత భాగం దుర్వినియోగమై గ్రామాలలోని లబ్దిదారుల నుంచి కిలో బియ్యం 10 రూపాయలకు, అక్కడి నుంచి దళారులు రూ.లు 14 కొని  మిల్లులకు రూ.లు 18, అదే ఎఫ్ సి ఐ కి కిలో బియ్యం రూ.లు 30 లతో  చాలా భాగం రీ-సైక్లిన్ అవుతుంది. కొంత ఇతరాత్ర కూడా దుర్వినియోగం అవుతుంది.

ఎఫ్ సి ఐ.. భారత ఆహార సంస్థ దేశ రైతులకు, ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యం, కొందరి అవినీతితో పక్క దారి పడుతుంది. సక్రమైనటు వంటి సరుకులు (రీ-సైకిల్, నాణ్యమైన బియ్యం) కొనుగోలు చేయక పోవడం, నిలువల నాణ్యతను కాపాడ లేక పోవడం, టెండర్లలో అవకతవకాలు జరుగుడం లాంటి సంఘటనలతో ఆశించిన ఫలితాలు సాధించ లేక పోతున్నాయి.

ఎఫ్ సి ఐ వద్ద ఇప్పటికే 700 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యం ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం వినియోగాని కంటే పంట ఉత్పత్తి ఎక్కువగాను, ఆహార సమస్య తక్కువగాను ఉన్నట్లు చెబుతున్నారు. గోదాంలలో ఎక్కువ రోజులు స్టాక్ నిలువ ఉంటే చెడి పోయే ప్రమాదం ఉంది. దీనిని కొంత తగ్గించాల్సిన అవసరం కనిపిస్తోంది.

దేశీయా మార్కెట్ లో రైస్ కి ధర ఒక క్వింటాల్ కు రూ.లు 2500, అంతర్జాతీయ మార్కెట్ లో రూ.లు 2600 ఉంది. ఎం ఎస్ పి ప్రకారం ఎఫ్ సీ ఐ వారు రూ.లు 3000 కొంటున్నారు.

పి డి ఎస్ కు రైస్ ద్వారా కొంటే క్వింటాల్ కు రూ.లు 1500 నష్టం వస్తున్నట్లు గాను, దాని బదులు ధాన్యాన్ని మిల్లుల వద్ద ఎఫ్ సి ఐ కొని టెండర్ ల ద్వారా మిల్లుల దగ్గరే అమ్మితే రూ.లు 500 నష్టాన్ని తగ్గించుకుని రూ.లు 1000 నష్టంతో సరి పెట్టుకోవచ్చాని ఎఫ్ సీ ఐ అధికారులు టెండర్లు పిలుస్తున్నారు.

రైస్ కొంటే రూ.లు 1500 నష్టం.. ధాన్యం కొంటే రూ.లు 1000 నష్టం.. ఎక్స్ పోర్ట్ చేస్తే రూ.లు 500 నష్టం..

దాని బదులుగా ఎక్స్ పోర్ట్ కు క్వింటాల్ కు రూ.లు 500 ఎక్స్ పోర్ట్ చేసే అవకాశం ఉంది. దీని వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. కనుక ప్రభుత్వం పరిశీలించి ఎక్స్ పోర్ట్ చేస్తే ప్రభుత్వానికి, రైతులకు మేలు జరుగుతుంది. దేశానికి విదేశీ మారకద్రవ్యం కూడా వస్తోంది. రాష్ట్రంలో ఇంకా లాస్ట్ ఇయర్ కోటనే పూర్తి చేయలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది.

ఎఫ్  సి ఐ వారు కొంటున్నాము అని చెబుతూనే గోదాంలలో స్థలం లేదు.. వాగిన్ మూమెంట్ లేదు అంటూ రైస్ మిల్లర్స్ నుంచి తొందరగా రైస్ లిప్ట్ చేయడం లేదు. కనుక రైస్ మిల్లర్స్ వద్దనే లాస్ట్ ఇయర్ స్టాక్ మిగిలి ఉంది. రైతాంగం సాగు చేయడం వల్ల ఎకరాకు రూ.లు 15 వేలు మిగిలినా, దేశానికి రూ.లు 50 వేలు ఉత్పత్తి ద్వారా ఆదాయం వస్తోంది. అంతె గాకుండా వ్యవసాయ వృత్తి వల్ల కోట్లాది మందికి ఉపాధి అవకాశం ఏర్పాడుతుంది.

కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి. తెలంగాణలో రబీ సీజన్ లో ప్రత్యేక పరిస్థితుల దృష్యా రా రైస్ మాత్రమే కొంటే టెస్ట్ మిల్లింగ్ ద్వారా ఎంత ఇల్డ్ వస్తే దానికి అనుగుణంగా రైస్ తీసుకోవాలి.

ఎక్స్ పోర్ట్ చేయించాలి. ఆ ఎక్స్ పోర్ట్ మేరకే ధాన్యానికి ఎం ఎస్ పి కి సమానంగా నేరుగా రైతులకే ప్రభుత్వం క్వింటాల్ కు రూ.లు 400 ఇస్తూ.. మిగిలిన ధర ఎక్స్ పోర్టర్ ద్వారా ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  ఈ రూ.లు 400 భారం రైస్ ప్రొక్యూర్ మెంట్ నష్టం కంటే చాలా తక్కువ.

 ఈ  విషయాలను పరిగణలోకి తీసుకుని రైతాంగానికి న్యాయం చేయగలరని కోరుతూ…

BJP-TRS political war బీజేపీ-టీఆర్ ఎస్ పొలిటికల్ వార్

ఇట్లు
మండవ వెంకటేశ్వర్ రావు,
రైతు, మాజీ మంత్రి
తెలంగాణ

Leave A Reply

Your email address will not be published.

Breaking