ప్రకృతి ముందు అందరు తల వంచాల్సిందే.. దానికి ఎదురు వెళ్లడం ఎవరి తరం కాదెమో..
మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమానం కూడా వాతవరణం అనుకులంచక పోవడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
బుధవారం రాత్రి గౌహతిలోని ప్రముఖ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగి పోయారు.
అమిత్ షా బుధవారం అర్థరాత్రి అగర్తలా చేరుకోవాల్సి ఉంది.
రాబోయే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా గురువారం అగర్తలాలో రెండు రథయాత్రలను ప్రారంభించనున్నారు.
వెస్ట్ త్రిపుర పోలీస్ సూపరింటెండెంట్ (SP) శంకర్ దేబ్‌నాథ్ మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం రాత్రి 10 గంటలకు అగర్తలలోని MBB విమానాశ్రయంలో దిగాల్సి ఉందని, అయితే దట్టమైన పొగమంచు కారణంగా కనిపించడం లేదు. గౌహతిలో తన విమానం ల్యాండ్ అయిందని, రాత్రి అక్కడే బస చేస్తానని చెప్పాడు.