Header Top logo

మహిళా పక్షపాతి : జగన్- రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు

రేపల్లె.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదవాడు ఉండడానికి నివేశ స్థలం, నివసించడానికి ఒక ఇల్లు కల్పించి మహిళ పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ప్రతి పేదవాడికి అండగా నిలబడుతూ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ‘వైయస్సార్ జగన్ అన్న కాలని’ నిర్మించి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో సెంటున్నర్ర, పట్టణ పరిధిలో సెంట్ల భూమిలో ఇల్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉగాది లోనే పూర్తిచేయాలన్నారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్వాకం వల్లే పేదవాడి కల చెదిరిందనీ, న్యాయస్థానాలు కూడా మోకాలడ్డుపెట్టాయని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఆలోచనతో క్రిస్మస్ పండుగ పర్వదినాన ప్రతి పేదవాడు ఆనందంగా జీవించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి అనేక విధాలుగా అడ్డుపెట్టినా సంతోషమేనని ఆనాడు 25 లక్షల మందికి సాయం చేయాలనుకుంటే నేడు అది కాస్తా దాదాపుగా 32 లక్షల మందికి సాయం చేసే అవకాశం లభించిందన్నారు. కేవలం 18 మాసాల్లోనే ఉన్నత ముఖ్యమంత్రులలో జగన్ పేరు సంపాదించుకున్నారు అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు మధ్యవర్తులను వస్తున్నాయనీ, పూర్తిస్థాయిలో పేదవాడికి చేరాలంటే మధ్యవర్తుల చేయి తడపాల్సిందేనని విమర్శించారు. కానీ జగనన్న పరిపాలనలో నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నారు. అమ్మ ఒడి రూ.15 వేలు ప్రతి సంవత్సరం తల్లుల అకౌంట్లలో నేరుగా జమ అవుతాయన్నారు. కుల, మతాలకు తమ ప్రభుత్వం అతీతమన్నారు. ప్రతి లబ్దిదారునికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక్కో కుటుంబానికి దాదాపు రూ. లక్ష అందినట్లు లబ్ధిదారులే చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు తమకు సహకరిస్తూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రతి చిన్న విషయాలకు మోకాలడ్డు పెట్టోద్ద చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండల నాయకులు ఉమారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున రావు, మున్సిపల్ కమిషనర్ విజయ సారథి, తహసీల్దార్ విజయ శ్రీ, ఎంపీడీవో సువార్త, వైసిపి పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదె వెంకయ్య బాబు గారు  వైసిపి ఎస్సీ సెల్ గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్, సీనియర్ న్యాయవాది కరేటి రామ్మోహన్రావు, నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు.రేపల్లె శ్రీకాంత్ ప్రజానేత్ర

 

Leave A Reply

Your email address will not be published.

Breaking