Header Top logo

నివేదా థామస్ జోరు తగ్గుతోందా?

తెలుగు తెరకి నివేదా థామస్ ‘జెంటిల్మెన్’ సినిమాతో పరిచయమైంది. నాని కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో ఆయన సరసన నాయికగా నటించింది. కొత్త అమ్మాయే అయినా చాలా బాగా చేసింది. ఆమె నటన చాలా సహజంగా అనిపిస్తుందని అంతా అనుకున్నారు. తెలుగులో ఆమెకి అది మొదటి సినిమానే కావచ్చుగానీ, ఆల్రెడీ మలయాళంలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. అందువల్లనే యాక్టింగ్ లో ఆమెకి అంతటి ఈజ్ ఉంటుంది.

కథానాయికగా కూడా మలయాళ ప్రేక్షకులను అలరించిన తరువాతనే ఆమె తెలుగు సినిమాల వైపుకు వచ్చింది. కెరియర్ ఆరంభంలో ఒక హిట్ పడితే చాలని అనుకుంటారు. కానీ నివేదా ‘నిన్ను కోరి’ .. ‘జై లవ కుశ’తో కలుపుకుని వరుసగా మూడు హిట్లు కొట్టేసింది. ఆ తరువాత ఒక సినిమా గ్యాప్ తో ఆమె మళ్లీ ‘118’ .. ‘బ్రోచేవారెవరురా’ వంటి హిట్లను సొంతం చేసుకుంది. ఇక ఆమె జోరు మరికొంత కాలం సాగుతుందని అంతా అనుకున్నారు.

కానీ అందుకు భిన్నంగా ఆమె జోరు తగ్గుతూ వస్తోంది. ‘వి’ సినిమాలో ఆమె సుధీర్ బాబు జోడీగా ప్రాధాన్యత లేని పాత్ర చేయడం .. ‘వకీల్ సాబ్’లో ముగ్గురు నాయికలలో ఒకరుగా నిలబడటం .. ఇప్పుడు ‘శాకిని – ఢాకిని’ సినిమా చేస్తుండటంతో, ఆమె ఎంపిక సరిగ్గా లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్లామరస్ హీరోయిన్ల ధాటికి తట్టుకోలేకనే ఆమె అలాంటి పాత్రలను చేస్తుందనేవారు లేకపోలేదు. మళ్లీ స్టార్ హీరోల జోడీగా .. పెద్ద బ్యానర్లలో అవకాశాలు పడితే పుంజుకుంటుందేమో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking