హైదరాబాద్ నుంచి సూర్యాపేట పర్యటనకు వెళ్తుండగా.. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయ, ఆయన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ప్రమాదం తప్పి వారంతా సురక్షితంగా బయటపడ్డారు. మరో వాహనంలో ఆయన సూర్యాపేట పర్యటనకు వెళ్లారు.