Header Top logo

పేదవాడి నాణ్యమైన చికిత్సకు ఎందుకు మంగళం పాడుతున్నారు?: దేవినేని ఉమ

ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం నీరు గారుస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సీఎంఆర్‌ఎఫ్‌కు ప్రతి నెలా దాతల నుంచి విరాళాల రూపంలో రూ.25-30 కోట్ల వరకూ వస్తుందని ఆంధ్రజ్యోతిలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీతో లింక్‌ పెట్టిందని చెప్పారు. సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు తగ్గించడం వల్ల విరాళాలు కూడా చాలావరకూ తగ్గిపోతాయని పేర్కొన్నారు. వీటిని ప్రస్తావిస్తూ జగన్ సర్కారుని దేవినేని ఉమ నిలదీశారు.

‘వైసీపీ అధికారంలోకొచ్చిన నాటినుండే సీఎంఆర్‌ఎఫ్‌కు గ్రహణం.. సిఫార్సులు పంపొద్దన్న సర్కార్. 2,434 శస్త్రచికిత్సలకు వర్తించని సాయం. ప్రతిఒక్క సిఫార్సుకు ఇచ్చినా నెలకు రూ.25 కోట్లే, ప్రతినెలా దాతల విరాళాలు 25 నుంచి 30 కోట్ల రూపాయలు. అయినా పేదవాడి నాణ్యమైన చికిత్సకు ఎందుకు మంగళం పాడుతున్నారు?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
Tags: Devineni Uma, Telugudesam, YSRCP, cm releaf funds

Leave A Reply

Your email address will not be published.

Breaking