Header Top logo

This is ‘MAA’ poverty ..!’మా’ దరిద్రం ఇదే..!

This is ‘MAA’ poverty ..!

మా’ దరిద్రం ఇదే..!

వేయి ఓట్ల హైడ్రామా
665 ఓట్ల కోసం మెయిన్ మీడియా వికృతం
చిత్రపురిలో 3వేల కోట్ల స్కాం.. కేటీఆర్, తలసానికి వాటా..?
ఇది చూపే దమ్ము, ధైర్యం లేని మెయిన్ స్ట్రీం మీడియా.!

ఆదివారం మధ్యాహ్నం ‘మా’ఎన్నికలు ముగిశాయి. మంచు విష్ణు గెలిచాడు. తెలుగు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని ఎన్నిక. హోరెత్తిన మీడియా. తెల్లారితే పతాక శీర్షికల్లో ‘గెలిచిన మంచు విష్ణు’ శీర్షికలతో కథనాలు. దరిద్రం ఏమిటంటే.. వీళ్ళకు ‘చిత్రపురి కాలని భూస్కాం’ పట్టింపు ఉండదు. డ్రగ్ విషయంలో నిజాలు మాట్లాడే దమ్ము, ధైర్యం ఏ మాత్రం ఉండదు. కొందరి చేతుల్లో నలిగిపోతున్న చిత్ర పరిశ్రమ కష్టాలు గురించి రాసే తీరిక, చూపే ఓపిక మీడియాకు ఉండనే ఉండదు. ‘స్క్రీన్ కోసం స్కిన్’ బిజినెస్ విషయంలో మాట్లాడే దమ్ము ఉండదు. ధైర్యం ఉండదు. సినీ పరిశ్రమ పేరుతో అన్ని పోగొట్టుకునే అభాగినుల కోసం ‘మా’ట్లాడే ధైర్యం ఎవరికి. ఉంది.?

సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టుల దుస్థితి:
ఉదాహరణకు పావలా శ్యామల సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ పరిస్థితి దయనీయం. ఇలాంటి వారెందరో ‘రంగులకల’లో బతుకీడుస్తున్నారు. అధికార మీడియా భజన. ఛీ.ఛీ. కృష్ణనగర్ లో ఎవరిని కదలించినా ఇవే కన్నీళ్ళు దోసిళ్ళతో పట్టుకొని కనిపిస్తారు. ఇది మెయిన్ స్ట్రీం మీడియా ఎన్నడూ రాయదు. చూపదు గాక చూపదు.

‘స్క్రీన్’పై కనిపించాలంటే.. ‘స్కిన్’ బిజినెస్:
సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే పైకి కనిపించేదంతా ఓ భ్రమ. లోపలంతా డబ్బు, మహిళల శరీరంతో జరిగే వ్యాపారం. ఇందులో సక్సెస్ శాతం ఓన్లీ వన్ పర్సంటేజ్. ఒక్క చాన్స్ పేరుతో వాడుకొని వదిలేసిన అభాగ్యులు ఎందరో..? ఎందరెందరో..! మీడియా అటు వైపు చూస్తే.. ఏ ‘మాయదారి కరోనా’ వస్తుందోనని భయం.

ఈ ప్రచారం ఎందుకు..?:
రాష్ట్రంలో గల్ఫ్ , రైతు, నిరుద్యోగ, మహిళా, ఆణగారిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే, ఏ ఒక్కటీ రాయరు. చూపవు. అంతా దమ్ము, ధైర్యం ల్లేవు. ఉన్నదల్లా భజన కీర్తనలే.! లేచింది మొదలు. గద్ద ముక్కు నాకుడు, చీకుడు తప్ప మరో ద్యాస ఉండదు. ప్రత్యేకించి ఏనాడూ ఓ రైతు, నిరుద్యోగ ఆత్మహత్యల గురించి రాసే, చూపే ధైర్యం లేని ‘ఐదో జెండర్’నపుంసక బతుకే.! యాజమాన్య వేధింపుల కారణంగా ఓ నిజాయితి గల జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకుంటే, కనీసం పట్టించుకునే తీరికలేని ఈ భజన మీడియా దరిద్రాన్ని బయటకు పంపేరోజు తప్పకుండా వస్తుంది.చిత్రపురిmaa mohanbabu లో 3వేల కోట్ల స్కాం.. చిన్నదొర వాటా..?:
చిత్రపురి భూ బాగోతంపై సంచలన ఆరోపణలు చేసింది చిత్రపురి సాధన సమితి. ఇది రూ.3 వేల కోట్ల కుంభకోణమని, అవినీతి కమిటీ సభ్యుల్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం వేసిన కమిటీనే అక్రమాలు జరిగాయని చెప్పినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు వల్లభనేని అనిల్ కుమార్ సినిమాలకు సంబంధించిన వ్యక్తే కాదని అంటున్నారు. అతని వెనుక మంత్రి తలసాని శ్రీనివాస్ ఉన్నారని.. 200 కోట్ల ముడుపులు ఇచ్చారని.. ఈ విషయాన్ని వాళ్లే పబ్లిక్ గా చెబుతున్నారని చిత్రపురి సాధన సమితి సభ్యులు తెలిపారు. తెలుగు సినిమా ‘హీరోలు జీరోలు’గా మారారని తమ సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇందులో ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ కు భారీ ముడుపులు అందాయని వారు ఆరోపిస్తున్నారు. ఇది చూపే ధైర్యం లేని మూస దంపుడు మీడియా.. మీరే ‘మా’కు పట్టిన అసలు దరిద్రం.

 

బాక్స్: ఇదీ ‘మా’ చరిత్ర:
తెలుగు సినిమా నటీనటుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సినీ పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసింది. వాస్తవానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆకాశంలో అంకురించింది. పోలీసుశాఖ సహాయార్థం తెలుగు నటీనటులు విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఆడి నిధులు సమీకరించారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అగ్రకథానాయకుడు చిరంజీవి, మురళీమోహన్.. నటీనటుల సంఘంపై ఆలోచన చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజులాంటి పెద్దల సమక్షంలో కళాకారులకు అమ్మలాంటి మా సంస్థను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొన్నారు. చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నియమించారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితర సీనియర్లు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. రెండేళ్లు మురళీమోహన్ నివాసంలోనే ‘మా’ కార్యకలాపాలు కొనసాగించారు. ఆ తర్వాత ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో 90వ దశకంలో అక్టోబర్ 4న అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

Nangi Devender Reddy

నంగి దేవేందర్ రెడ్డి, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking