నెలనెలా విద్యుత్తు చార్జీల సవరణ దుర్మార్గం మరియు దోపిడీ
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ
విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించే ఇంధనం చార్జీలు మరియు విద్యుత్తు కొనుగోలు ధరలు పెరుగుతున్నాయన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ.
సాకుతో ఈ భారాన్ని నెలవారీగా వినియోగదారులపై వేయాలని కేంద్ర విద్యుత్తు శాఖ విద్యుత్తు నిబంధనలు 2005 ను సవరిస్తూ కొత్త నిబంధనలు జారీచేయడం దుర్మార్గమన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ.
ఇది ప్రత్యేక్ష దోపిడీలో భాగం అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
నేలవారుగా విద్యుత్తు చార్జీలు పెంచి భారం వేయడం పేద ప్రజల నడ్డివిరచడమేనని అయన మండిపడ్డారు.
ఇంధనం, విద్యుత్తు కొనుగోలు సర్దుబాటు సర్ ఛార్జి అంటే వినియోగదారులకు విద్యుత్తు సరఫరా చేయడానికి అయ్యేఖర్చు అని, ఈ అదనపు భారాన్ని లెక్కించి వినియోగదారుల బిల్లులో కలపాలని కేంద్ర విద్యుత్తు మంత్రుత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటన్నారు.