‘Our’ election results go viral on social media .. మా ఫలితాల వైరల్..
‘Our’ election results go viral on social media ..
సోషల్ మీడియాలో ‘మా’ ఎన్నికల ఫలితాల వైరల్..
అందు గలదు ఇందు లేదని సందేహం వలదు.. ఎందెందు చూసినా కుళ్లిన ఎన్నికల తీరే.. కుల గజ్జితోనో.. మత పిచ్చితోనో.. డబ్బు హంకారంతోనో గెలిసే ఎన్నికలని మనందరికి తెలుసు..? తెలిసినా మౌణవ్రతం పట్టి కళ్లుండి అంధుడిలా ఉంటున్నాం. హుజురాబాద్ ఉప ఎన్నికలు కావచ్చు.. అక్కడ కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు చేస్తుంటే… ఇగో.. ఆదివారం సినీ ప్రపంచంలో జరిగిన ’మా‘ ఎన్నికలపై సోషల్ మీడియా ఆడుకుంటుంది. ఒక్కోక్కరు అభిప్రాయాలను కత్తుల్లా గుచ్చుతున్నారు.
గెలిచింది విష్ణు కాదు, ఓడింది ప్రకాష్ రాజ్ కాదు !ఇండస్ట్రీని ఏలుతున్న ఆ నాలుగు కుటుంబాలలో ఈ మూడు కుటుంబాలు కలిసి, ఆ మెగా కుటుంబాన్ని ఓడించాయి, అంతే.. ఓ పోస్ట్.. ‘మా’ ఎన్నికల్లో గెలిచిన మంచు.. మెగా ఫ్యామిలి సపోర్ట్ ఉన్న ప్రకాష్ రాజ్ ఎందుకు ఓడిపోయాడు..? ఇండస్ట్రీ లో మెగా అంత బుస్స్ అని ఇండస్ర్టీలో వారు అనుకుంటున్నారా?.. మరో పోస్ట్.. రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాటలు ప్రకాష్ ఓటమికి కారణం అయ్యాయా? ఇదో పోస్టే.. మిరు మిలాగే ఉండండి !.. ప్రకాష్ రాజ్ గారూ క్షమించండి… !! వీళ్లకు కులం, మతం, డబ్బు, ప్రాంతీయతే ముఖ్యం… అభ్యుదయ భావాలు సరిపడవన్న మాట… ఇండస్ట్రీలో అలా ఏడ్చినా అత్యధిక మంది ప్రజలు మీకే మద్దతు తెలిపారు…ఏదేమైనా మీ పద్ధతి ప్రకారం మీరు కొనసాగండి…మీరు మాత్రం మారొద్దు… అంటున్నారు సరితశ్రీ గారు.. #కులామతల్లినెగ్గింది.చిరంజీవి గారు సినిమాల్లో మెగాస్టార్ కావచ్చు గానీ, నిజజీవితంలో indecisive గా, పిరికిగా భయస్తుడిగా మిగిలిపోయాడు. కమ్మ dominated టాలీవుడ్లో కాపు అయ్యుండీ ఒంటరిగా స్వశక్తితో పైకొచ్చిన ఈయన, రాజకీయంగా ఒకస్థాయి అందుకోలేక పోయాడు అంటే, ఈయనకున్న పిరికితనమే కారణం. అంటున్నారు అరుణ గొగులమలమంద గారు..
ఈరోజు టాలీవుడ్ని ఏలేస్తున్న నాల్గు కుటుంబాల్లో మూడు కమ్మ, చిరంజీవి కాపు. ఈ కమ్మ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టే ఆలోచన చిరంజీవికి ఉండి ఉంటే MAA ఎన్నికల్లో తానే పోటీ చేసినా బాగుండేది, లేదా ప్రజాస్వామ్యవాది ప్రకాష్ రాజ్ నాయకత్వాన్ని బలపరుస్తున్న సంగతి బహిరంగంగా ప్రకటించినా బలాబలాలు కరెక్ట్ గా ఉండేవి. ప్రకాష్ రాజ్ గెలిచే విధంగా ప్రణాళిక రచించి దానికి శ్రమించాల్సింది. అలా చేయకుండా neutral గా, నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఉండడం వల్ల పోటీ “నిజాయితీ తప్ప కులబలంలేని ప్రకాష్ రాజ్ కీ, కులం బలమ్ దండిగా ఉన్న విష్ణు
కీ” మధ్య అన్నట్టు అయిపోయి, ఇండస్ట్రీలో ఉన్న ఆ కులపోళ్ళంతా కూడబలుక్కొని తమవాడినే గెలిపించుకున్నారు, చిరంజీవిగారేమో ఎప్పట్లాగే మంచి బాలుడు అనిపించుకోవడానికి నోర్మూసుకుని ఉండిపోయారు. మంచు విష్ణు వైసీపీ అయ్యి, ఎన్టీఆర్ కుటుంబం టీడీపీ అయ్యీ కూడా( ప్రకాష్ రాజ్ ని ఓడించడానికి అందరూ ఏకమైపోయారు అంటే, ఏ స్థాయి unity ఇది? ఇదీ కులం అంటే. ఆంధ్రప్రదేశ్ ఈ కుల పిచ్చిని దాటి ఎదగడం అనేది జరగదు అని, ఈ రాష్ట్రమ్ లో ఏ ఎలెక్షన్లు అయినా కులంతోనే ముడిపడి ఉంటాయనీ ఈ MAA ఎన్నికలు కూడా prove చేసాయి. ప్రకాష్ రాజ్ లాంటి మానవహక్కుల నాయకుడు గెల్చి ఉంటే పరిశ్రమ లోని చిన్న కళాకారులకు హక్కుల, సౌకర్యాల కల్పనకోసం గట్టిగా కృషి చేసి ఉండేవాడు ఓడిపోవడం వల్ల ఆయనకి ఆ ఇబ్బందులు తప్పాయి. PR ని గెలిపించుకోలేకపోవడం వల్ల ఎంత నష్టమో, సభ్యులకు త్వరలోనే అర్ధం ఔతుంది, అలాగే ఎలాంటి కుట్రలూ కుతంత్రాలూ లేకుండా నిజాయితీగా పోటీలో నిలిచిన PR, నైతికంగా తానే విజేత అనేది కూడా వారికి, బైటినుంచి ఫాలో అయిన వారికి స్పష్టమయ్యింది. ఇక ఆయన ఎప్పటిలా తన జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టి మంచి ప్రజా రాజకీయవేత్తగా ఎదుగుతాడని ఆశిద్దాం..
Prakash Raj #Lessonfrom_MAA
Aruna Gogulamanda