My support to Prakash Raj in MAA elections #అతి_జుగుప్సాకరం !!
#టాలీవుడ్ ల పెద్దల ప్రాంతీయ తారాగం ! #అతి_జుగుప్సాకరం !!
My support to Prakash Raj in MAA elections..
మా ఎన్నికల్లో నా మద్దతు ప్రకాష్ రాజ్ కు తెలుగు ఇండస్ట్రీలో కధనాయకుల రోల్స్ వేసేవాళ్ళందరూ (ఆ కులాల)తెలుగువాళ్లే, (మళ్లీ ఇక్కడ తెలంగాణా వాళ్లకు కూడా చోటుండదు, ఇండస్ట్రీ తెలంగాణలో ఉండీ). మళ్లీ తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా చేసే నిజాయితీ ఉండదు. ఇంతోటి వీరోలుండీ, ముంబై నుండి వంద ఆపరేషన్లు చేయించుకున్న తెల్లతోలు హీరోయిన్లను దిగుమతి చేసుకుని, ఫుల్లు స్కిన్ షో చేయించకపోతే సినిమా దొబ్బుతుందని భయం.
మళ్లీ వాళ్లకు కూడా నటనకు ఆస్కారమున్న రోల్స్ create చేస్తారా అంటే హెబ్బే… అదేం చేయరు. ఇంట్లో పిల్లుల్లా, సినిమాల్లో పులుల్లా, భార్యల చాటు భర్తల్లా, మామల చాటు అల్లుళ్ళలా బతికే వీళ్ళు, వీళ్ళ సినిమాలలో మాత్రం వంద సుమోలని ఒక్కసారే లేపేస్తారు, వందమందిని ఒక్కసారే చంపేస్తారు.. రైల్వేస్టేషన్లను కొనేస్తారు, పెళ్ళిళ్ళమీద పెళ్లిళ్లు చేసుకుంటారు (ఇన్ని నేరాలు చేసినా పోలీసులు మాత్రం వీళ్ళని అరెష్టు చేయరు🙄) ఇంత సత్యదూరంగా ఉన్న సినిమాల్లో వీళ్లు, వీళ్ళ కొడుకులే నిరంతరం హీరోలు.వీళ్లు విగ్గులు పెట్టుకొని,
అమెరికా కెళ్లి కొవ్వు కోయించుకునే సర్జరీలు చేయించుకుని, ముక్కూ మూతీ బాలేవని అవీ set చేయించుకుని..ఇన్ని చేసి మనల్ని చావగొడుతూ ఉంటూనే ఉంటారు గానీ, ఇతర కులాలనుండి, భాషలనుండి మాత్రం #కధానాయకులుగా ఎవర్నీ entertain చేయ(లే)రు. మరి హీరోయిన్లనూ, character ఆర్టిస్టులనూ పక్క రాష్ట్రాలనుండి యథేచ్ఛగా దిగుమతి చేసుకుంటూ, ప్రకాష్ రాజ్ లాంటి తిరుగులేని యాక్టర్ తెలుగులో ఒక్కడూ లేక, అతడి అసమాన నటనా ప్రతిభను వీళ్ళ సినిమాల విజయం కోసం ఉపయోగించుకుంటూ ఇప్పుడు అతడు “ఈ ఇండస్ట్రీలో నేనూ పనిచేశాను”అని నమ్మి, టాలీవుడ్ కార్మికులకు, కిందిస్థాయి నటులకూ హక్కులు కల్పించాలనే ఉద్దేశ్యంతో #MAA ఎన్నికల బరిలో నిలబడితే..ఏంటి ఒక్కొక్కడూ ప్రాంతీయత రాగం తీస్తున్నారు? ఒక్కడు కూడా మాతృభాష సైతం రెండుముక్కలు తిన్నగా మాట్లాడలేరు?
తెలుగమ్మాయిలు హీరోయిన్లు ఔదామని వస్తే casting couch కి బలిచేసి అన్యాయం చేస్తారు?ఎదురు తిరిగితే మళ్లీ సినిమాల్లో కనబడకుండా చేసేంత కుట్రలు పన్నుతారు, పరభాషా నటుల విలనీయం వాడుకొని మీరు హీరోలౌతారు? మీ మేకప్పులకు ఇక్కడ facilities కుదరక విదేశీ టెక్నిషియన్లని కోట్లుపోసి తెచ్చుకుంటారు. ఇక్కడ విలువల్లేవ్, హక్కుల్లేవ్, (..కాస్త చారిటీ చేసి, ఫలానా హీరో దేవుడు అని పదే పదే పేద నటులతో పొగిడించుకుంటారు.) మళ్లీ సిగ్గులేకుండా కేవలం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక కులం చేతిలో ఉండాలనే దుర్బుద్ధితోనే కదా లోకల్ నాన్ లోకల్ అని కతలు పడుతున్నారు?ఎవరికి తెలీదంటా?? #Im with_PrakashRaj
Aruna Gogulamanda