I am a party activist నేను ఒక పార్టీ కార్యకర్తను
I am a party activist
నేను ఒక పార్టీ కార్యకర్తను
నేను ఒక నాయకుడి అనుచరుడను.. నేను ఒక పార్టీ కార్యకర్తను..
నా నాయకుడు ఎత్తిన జెండే నా ఎజండా.. నా పార్టీ సిద్ధాంతమే నాకు పంచమ వేదం..
నా నాయకుడు పట్నం నుండి మా పట్టణానికి వస్తున్నాడంటే పూల గుత్తులు..
బాటసారుల బాధలు నాకెందుకు.. పార్టీ బ్యానర్లతో శివారు రోడ్డులో అడ్డంగా నిలబడుతా…
నా నాయకుడు శిలాఫలకం వేయడానికో.. రిబ్బన్ కటింగ్ కో వస్తే..
అక్కడి దారులన్నీ మా కాన్వాయ్ తో అడ్డంగా నింపుతాం..
నేను నా పార్టి కండువా మెడలో వేసుకుని నాయకా గిరి ప్రదర్శిస్తూ..
మా నాయకుడి హోదాను, మా పార్టీ పెత్తనాన్ని చాటుతాం..
రోడ్డుపై కిలో మీటర్ల పొడవున నిలిచిన వాహనాల్లో
పురిటి నొప్పులతో బాధపడే నిండు గర్భిణి ఉంటే నాకేంటి..?
పెరుగన్నంలో పురుగుల మందు కలుపుకుని
ఆత్మహత్యకు పాల్పడిన రైతు కొన ఊపిరితో ఉన్న అంబులెన్స్ ఆగిపోతే నాకేంటి..?
పన్నెండేళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించిన,
నా తల్లిదండ్రులు గర్వపడేలా చెయ్యాలన్న కలలతో
ప్రవేశ పరీక్ష రాయడానికి వెళుతున్న విద్యార్థులుంటే నాకేంటి..?
నా పార్టీ అధినేతే నాకు జాతిపిత. నా నాయకుడి సేవే నాకు మాధవ సేవ.
ఎందుకంటే..? నేను ఒక నాయకుడి అనుచురడను. నేను ఒక పార్టీ కార్యకర్తను.
నా నాయకుడు ఎత్తిన జెండే నా ఎజండా.. నా పార్టీ సిద్ధాంతమే నాకు పంచమ వేదం.