- విభేదాలు పనికిరావని స్పష్టీకరణ
- ఐకమత్యంగా ఉండాలని సూచన
- ఎన్నికల పరాభవంపై తీవ్ర ఆవేదన
- కాంగ్రెస్ కు పునర్వైభవం అత్యావశ్యకమని కామెంట్
ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైంది పార్టీలో ఐకమత్యమని ఆమె స్పష్టం చేశారు. అందుకు తాను ఏం చేయడానికైనా సిద్ధమన్నారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశామని, చాలా మంది చాలా సలహాలిచ్చారని గుర్తు చేశారు. ‘చింతన్ శిబిర్ (ఆత్మ పరిశీలన)’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇటీవలి సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తేవడం అత్యావశ్యకమని సోనియా అన్నారు. కానీ, అది అంత తేలికైన పనేం కాదని, ఇంతకుముందుతో పోలిస్తే ఎన్నో సవాళ్లు మన ముందున్నాయని పార్టీ ఎంపీలకు సోనియా చెప్పారు. కాగా, ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.