Painter .. “Raghuram Bairu”
*ఈ చిత్రకారుడు పక్కా….హైదరాబాదీ..!!
*గ్రాఫిక్ ప్రింట్ మేకింగ్ కళలో ఆరితేరిన…. హైదరాబాద్ చిత్రకారుడు..”రఘురామ్ బైరు”,(Graffic Print Making Artist Raghuram Bairu from Hyderabad.Telangana, India.)ఆగస్టు 18,1949 లో జన్మించారు.చిన్నప్పటి నుండే చిత్రాలు గీసేవారు.తొమ్మిదో తరగతిలో చదివే సమయంలో స్కూల్లో నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో రఘురామ్ కు రెండో బహుమతివచ్చింది.అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతిని అందుకొని తెగ సంబర పడ్డాడు.
అయితే పిల్లాడు ఇలా చదువుమానేసి బొమ్మలు గీసుకోవడంలో పడ్డాడని తల్లిదండ్రులు బాధపడ్డారు.ఆ తర్వాత డ్రాయింగ్ లో లోయర్,హయ్యర్ పాసయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ లో బిఎ చదివారు.కర్నాటక గుల్బర్గా యూనివర్సిటీ లో ఆర్ట్స్ లో డిప్లొమా చేశారు. జనాభాగణ (సెన్సెస్ ) శాఖలో ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని భోలక్ పూర్ లోవిశ్రాంత జీవనం గడుపుతున్నారు..ఏడుపులు వయసులో కూడా ఆయన ఉత్సాహంగా చిత్రాలు వేస్తుండటం…. విశేషం.
ఓ వైపు ఉద్యోగం,ఇంకో వైపుచిత్రలేఖనం ప్రాక్టీసు జరుగుతుండేది. 1980 లో లలిత కళా అకాడమీ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రాఫిక్ స్టుడియో ప్రారంభమైంది. రఘురామ్ అందులో… సభ్యుడిగాచేరి నలుపు..తెలుపు గ్రాఫిక్ ఆర్ట్ కు శ్రీకారంచుట్టారు.గ్రాఫిక్ ప్రింటింగ్ మేకింగ్ కళను మొదలు పెట్టారు.తన భావం వ్యక్తీకరణకు ఈ కళ సూటైంది.ఇక అంతే..వెనుదిరిగి చూసుకోలేదు.1995 లోభోపాల్ బినాలె షోలో పాల్గొన్నారు.1996 లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ గోల్డ్ మెడల్ వచ్చింది.1997 లో జాతీయ అవార్డు అందుకున్నరు.గ్రాఫిక్ ఆర్ట్స్ గురించి ముద్రించిన పుస్తకం లో రఘురామ్ గురించి ఓ ఆర్టికల్ వుంది. 2013 లో హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ వారి కళా రత్న ప్రతిభా పురస్కారం లభించింది. 2015 లో లండన్ లో జరిగిన గ్రూప్ షోలో పాల్గొన్నారు.2017 లో జపాన్ వారు రెసిడెన్సీకి పిలిచారు.అక్కడ జరిగిన గ్రూప్ షోలలో పాల్గొన్నారు.
*నలుపు..తెలుపు చిత్రాలు!!
*పల్లెజీవితంలోని కష్టసుఖాల
*గ్రాఫిక్ ప్రింట్ మేకింగ్ కళలో ఆరితేరిన…. హైదరాబాద్ చిత్రకారుడు..”రఘురామ్ బైరు”,(Graffic Print Making Artist Raghuram Bairu) కు అభినందనలు…!!
*ఎ.రజాహుస్సేన్, రచయిత, హైదరాబాద్