ఫుట్ పాత్ ల విస్తరణపై మంత్రి కేటీఆర్..

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ, నూతన మౌలిక వసతుల కల్పన, ఫుట్ పాత్ ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత – కేటీఆర్

పాదచారులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు మంత్రి కేటీఆర్. ప్రజారవాణా బలోపేతంతోనే నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణ జరుగలన్నారు.

హైదరాబాద్ నగరంలో ఫుట్ పాత్ ల నిర్మాణం, విస్తరణ, ప్రణాళికల రూపకల్పన కు సంబంధించి నగర పోలీస్ అధికారులతో పాటు జిహెచ్ఎంసి,సంబంధిత ఇతర శాఖల అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు.

రోజురోజుకు అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో పాదాచారులకు రక్షణ కల్పించడం, పుట్ పాత్ ల నిర్మాణం, రోడ్ల విస్తరణ లాంటి సవాళ్లు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయన్న కేటీఆర్, ఎప్పటికప్పుడు నూతన ప్రణాళికలను అమలుచేయడంతోనే ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.

పాదచారుల రక్షణ కోసం పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది అందించాల్సిన సహకారంతో పాటు నగరంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్ లు, నూతన ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

నగరంలో ఇప్పటికే 60 జంక్షన్ లను జిహెచ్ఎంసి అభివృద్ధి చేస్తోందని, పాదాచారులే ప్రధాన కేంద్రంగా దాదాపు 12 జంక్షన్లలో మౌలిక వసతులను కల్పిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ కు జిహెచ్ఎంసి అధికారులు ఈ సమావేశంలో వివరించారు. కూకట్ పల్లి, సోమాజిగూడ, పంజాగుట్ట,కొత్తపేట, హబ్సిగూడ, ఖైరతాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో నూతనంగా జంక్షన్ లను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Minister KTR with officials on expansion plans of foot paths
Comments (0)
Add Comment