Experiences Source
ఇప్పుడు అనుభవాలు మూల పడ్డాయి
మాయల మరాఠీ…!!
ఇప్పుడు అనుభవాలు
మూల పడ్డాయి…
జ్ఞాపకాల దొంతరలోనే
రాత్రీ పగలు కాలక్షేపం
ఎవరికైనా, ఎప్పుడైనా
ఇలాంటి ఓ పరిస్థితి
తప్పదేమో?
అనుభవాలు …
మనిషి జీవన సారమైతే
జ్ఞాపకాలు…
మనిషి బతుక్కు ఊతం!!
అప్పుడు…
అనుభవాల ఒడిలో
నిత్యం శ్రమించడం
ఇప్పుడు….
జ్ఞాపకాల పందిరి కింద
సేదతీరడం…!!
ఈ జీవితంకూడా …
చిత్రమైంది…
వయసులో వున్నపుడు
పరుగులు పెట్టిస్తుంది
వయసుడిగాక..
జ్ఞాపకాల తోటలో
కలలు కనమంటుంది.
జీవితమా…!
నువ్వో…
మాయల మరాఠీవా?
Experiences Source
ఎ.రజాహుస్సేన్, కవి
చిత్రం..అన్వర్