సినీ హీరో అంటే ప్రేక్షలలో అదో మోజు.. ఇష్టమైన హీరో ఇంటార్వ్యూ వచ్చిందంటే ఆ హెప్పినెస్ వేరు. ఇగో.. నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎన్బీకే అన్‌స్టాపబుల్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. అందులోని డైలాగ్ ఇదే..
ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా?.. బాలయ్య సూటి ప్రశ్నకు పవన్ జవాబు…
– ఇందులో బాలయ్య, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సరదా సంభాషణలను చూపించారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న టాక్ షో
ఈ టాక్ షో సీజన్-2లో ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు గెస్ట్లుగా వచ్చారు.
బాలయ్యతో సరదా, ఆసక్తికర సంభాషణలు సాగించారు.
కాగా, ఈ షోకు ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వచ్చారు.
త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఎపిసోడ్‌ను రెండు పార్ట్‌లుగా ప్రసారం చేయనున్నారు.
ఈ క్రమంలో ఆహా ప్లాట్‌ఫామ్ పవన్‌కల్యాణ్ ఎపిసోడ్ పార్ట్-1 ప్రోమోను విడుదల చేసింది.
ఇప్పుడు విడుదలైన ప్రోమోలో బాలకృష్ణ, పవన్ మధ్య జరిగిన సరదా సంభాషణలను చూపించారు.
అందులో పవన్ కల్యాణ్‌ను బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.
దానికి అదే రీతిలో పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు.
ఈ ప్రోమో పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతోంది.
ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే విషయం ఇప్పటివరకు ఆహా అధికారికంగా ప్రకటించలేదు.
సీజన్ 2 చివరి ఎపిసోడ్‌గా పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఫిబ్రవరి రెండో వారంలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
దీనికి తోడు ఆహా ప్లాట్‌ఫామ్, ‘బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్’ అంటూ పవన్ ఎపిసోడ్‌పై అంతకంతకూ అంచనాలు పెంచుతోంది.