అనంతపురంలో కరోనాతో మృతిచెందిన ఓ హోంగార్డ్ కు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ జాకీర్ హుస్సేన్ అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. ప్రస్తుత కాలంలో మనిషిని మనిషి తాకాలంటే భయపడే పరిస్థితుల్లో అందరికీ ధైర్యం చెప్పి అంత్యక్రియల్లో పాల్గొన్న సిఐకు పలువురు అభినందనలు తెలిపారు. అనంతపురం పిటిసిలో హోం గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న కాసిం సాహెబ్ కరోనాతో మృతి చెందాడు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి సిఐ అశోక్ నగర్ లోని ముస్లిం స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ కోరారు.