AP 39TV 28ఫిబ్రవరి 2021:
కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డ్ వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ఆచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి నిరంతరం మహిళల సంక్షేమానికి పాటు పడుతున్నారని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన దృఢ సంకల్పంతో వైకాపా ప్రభుత్వం పని చేస్తుందని కావున మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు ,తదితరులు పాల్గొన్నారు.