AP 39TV 01 ఏప్రిల్ 2021:
పూలకుంట ప్రాథమిక పాఠశాల మండలంలోనే సేవా కార్యక్రమాలు మరియు అవగాహన సదస్సులు నిర్వహించడంలో లో ప్రథమ స్థానం.. ఆదర్శం…. AP39Tv న్యూస్. గుమ్మగట్ట మండలం, పూలకుంట గ్రామం లోని ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు పిల్లలకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు covid 19 పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం శ్రీ వాణి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, ప్రతి గంటకు ఒకసారి చేతులు నీటితో కడుక్కోవాలి అని, శానిటైజర్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని ఒకరి వస్తువులు ఇంకొకరు ఉపయోగించరాదని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కొవిడ్-19 టెస్ట్లను విద్యార్థులకు మరియు వంట ఏజెన్సీ వారికి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం రాయుడు, ఎం పి హెచ్ శకుంతల తదితరుల ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేష్, శివకుమార్, రాధమ్మ, వీణ రాధా, మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. గుమ్మగట్ట మండలం లోని పూలకుంట గ్రామం లోని ప్రాథమిక పాఠశాల అనేక అవగాహన కార్యక్రమాలను కల్పించడంలో ఎల్లప్పుడూ మండలంలోని ప్రథమంగా నిలుస్తుందని గుమ్మగట్ట ప్రజలు ఈ సందర్భంగా తెలియ చేయటం విశేషం.
ఎం శ్రీధర్,
ఏపీ 39 టీవీ అనంతపురం.