ఏపీ 39 టీవీ,
ఏప్రిల్ -03,కళ్యాణదుర్గం
జడ్పీటీసి, ఎంపిటీసీ ఎన్నికల నేపథ్యంలో కళ్యాణదుర్గం డీఎస్పీ ఎన్ రమ్య ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు జుంజురాంపల్లి, బిఎన్ హళ్లి, 74 ఉడేగోళం, ఆవులదట్ల గ్రామాలలో ప్రజలతో సమావేశమై ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి మరియు ఎన్నికల వేళ ఏమి చేయాలో ఏమి చేయకూడదో వివరించారు. అక్రమ మద్యం, తదితరచట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.అల్లర్లు,గొడవలకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని పోలింగ్ లొకేషన్లు,కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు,
ఎం.శ్రీధర్,
ఏపీ39 టీవీ,రిపోర్టర్,