Zindagi Muchata ..
Open idea for life
జిందగీ ముచ్చట..
బతుకు తెరువు ఆలోచన
బతుకు తెరువు ఆలోచన ఉంటే బజార్ లోనైనా బతుకచ్చు. హైదరాబాద్ లో నైతే ఏదో పని చేసుకుని బతుకు వెళ్ల తీస్తున్న ఫ్యామిలీస్ బోలేడు.. ఇగో గీ చాపలు అమ్ముతున్న ఈ ఫ్యామిలీ కొంపల్లిలోని హైటెన్షన్ వైర్ రోడ్ లో ప్రతి సండే కనిపిస్తోంది. అంగడిపేట్ కు చెందిన వేణుకు తెలిసిన విద్య చాపల అమ్మకమే. అతనికి సహాకరిస్తోంది అతని భార్య లక్ష్మీ. ఆంధ్ర నుంచి, రాంనగర్ తెప్పించే చాపలను అమ్ముతూ జీవనోపాధి పొందుతుంది ఆ కుటుంబం.
సండే మాత్రమే పని చేసే పిల్లలు
ఇగో.. ఈ ఫోటోలో ఉన్న వారందరిది ఒకటే కుటుంబం. సండే వచ్చిందంటే చాలు అందరూ చాపలు అమ్మడంలో బిజీ బిజీగా ఉంటారు. కానీ, ఆ పిల్లలు పని చేసినందుకు కూడా పేరేంట్స్ డబ్బులు ఇస్తారు మరీ. అగో పిల్లలు పని చేసినందుకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం ఏమిటని అనుకుంటుండ్రా..? చిన్నప్పటి నుంచి కష్టేఫలి అని పిల్లలకు తెలియడానికి డబ్బులు ఇచ్చి వాళ్లకు పొదుపు జీవితం నేర్పుతామంటున్నాడు పిల్లల తండ్రి వేణు. సండే రోజు మాత్రమే వాళ్లు పని చేస్తారు. మిగతా రోజులలో చదువుకోవడానికి సర్కార్ స్కూల్ కు వెళుతారు. పెద్ద బిడ్డ దేవాకి ఆరవ తరగతి చదువుతుంది. రెండో బిడ్డ హేమలత నాల్గవ తరగతి, కొడుకు దివ్యాందర్ ఒకటవ తరగతి చదువుతుండ్రు. ఇగో గీళ్ల జిందగీ భలేగా ఉంది కదూ..
Zindagi Muchata .. Open idea for life