వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని లాంఛనంగాప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి “వైఎస్సార్ ఉచిత పంటల బీమా” పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతుల ఖాతాల్లో బీమా పరిహారాన్ని జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి

అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ , అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి_రంగయ్య ,ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, తదితరులు….

2020 సంవత్సరం ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందించడంలో భాగంగా “వైఎస్సార్ ఉచిత పంటల బీమా” పథకం కింద అనంతపురం జిల్లాకు చెందిన 2,46,469 మంది రైతులకు చెందిన 7,91,971 ఎకరాలలో జరిగిన పంటనష్టానికి పంటల బీమా కింద 266.42 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలో జమ కానుంది.

Comments (0)
Add Comment