You have to look at those children and learn
ఆ పిల్లను చూసి ‘బతుకు’ నేర్చుకోవాల్సిందే
డిగ్నిటీ లేబర్ అంటే చాలా మంది చదుకున్నోళ్లకు అర్థం తెలియదచ్చు. నిజమే తెలిస్తే సర్కార్ కొలువు రాలేదని.. బతుకు తెరువు లేదని ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు..? కానీ, చదువుతో పాటు పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ కుటుంబానికి ఫైనాన్సీయల్ గా ఆచర అవుతున్నారు చాలా మంది.
సోషల్ మీడియా ఫోటో కాదు
ఇగో ఈ ఫోటోలో ఆటో డ్రైవింగ్ సీట్లో కనిపిస్తున్న యువతి పేరు సబిత. సోషల్ మీడియా కోసం సెల్ఫీ దిగి ఫోటోలు ఆఫ్ లోడ్ చేసేవారే ఎక్కువ. కానీ ఈ సబిత ఆ డ్రైవింగ్ సీట్లో సరదాగా కూర్చుని ఫోటోలకో.. సెల్ఫీలకో ఫోజు ఇవ్వడం లేదు. నిజంగానే ఆ ఆటో డ్రైవరే ఆమె. కష్టాలకు, సమస్యలకు కుంగి పోకుండా ఒక వైపు ఆటో డ్రైవింగ్ ద్వారా సంపాదించుకుంటూ మరో వైపు ఇంటర్మీడియేట్ చదువుతోంది.
కన్నతండ్రి దూరమైతే
నకిరేకల్ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్మీడియేట్ చదవుతున్న సబితది శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం. స్టూడెంట్ అంటే భుజనా బ్యాగుతో మాత్రమే కనిపించాలని అమ్మానాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో స్నేహితులతో సరదాగా కాలేజీ రోజులను ఎంజాయ్ చేయాలనుకునే సాదీ సీదా విద్యార్థి కాదు సబిత. కన్నతండ్రి దూరమైతే కన్నతల్లి పడుతున్న కష్టాలను చూసి తట్టుకోలేక తల్లికి ఆర్ధికంగా అండగా నిలిచేందుకు ఆటో డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుంది.
ఆటో నడుపుతూ చదువుతూ
మరో వైపు తనకు ఇష్టమైన చదువును అటక ఎక్కించకుండా కాలేజీకి వెళుతూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది సబిత. తన ఊరి నుంచి నకిరేకల్ పట్టణం దాకా ప్రయాణికులను తన ఆటోలో ఎక్కించుకుని నకిరేకల్ కు తీసుకువస్తుంది. ప్రయాణికులను దించేశాక అదే ఆటోను తీసుకుని కాలేజీకి వెళుతుంది. క్లాసులు విన్న తర్వాత కాలేజీ వదిలాక తిరిగి నకిరేకల్ సెంటర్లో ప్రయాణికులను ఎక్కించుకుని తనూరు వంగమర్తి వైపు ఆటోలో రివ్వున దూసుకుపోతుంది. అమ్మా కాలేజీలో జాయిన్ అవుతున్నా నాకు కొత్త స్కూటీ కొని ఇవ్వు అంటారు ఈ తరం స్టూడెంట్స్. డాడీ మార్కెట్లోకి లేటెస్ట్ స్పోర్ట్స్ బైక్ వచ్చింది మా ఫ్రెండ్ కొన్నాడు కాలేజీకి అదే బైక్ పై వస్తున్నాడు అని గుర్తు చేస్తారు. నాకూ అలాంటిదే కావాలి అని పేచీ పెట్టే నేటి కుర్రకారుకు భిన్నంగా ఆలోచన చేసింది సబిత. ఆత్మ విశ్వాసమే ఆలంబనగా తన కన్న తల్లికి అండగా ఉంటూ ముందుకు సాగుతున్న సబితను చూసి నేటి యువత జీవిత పాఠాలు నేర్చుకోవాల్సిందే.
You have to look at those children and learn
సేకరణ: ఫణి రాజ్