గురువెవరు? (కవిత్వం)
Who is teacher?
కని పెంచిన
తల్లి గురువు కాదా.
తండ్రి గురువు కాదా
మిత్రుడు గురువు కాదా
ప్రకృతి గురువు కాదా.
సమాజం గురువు కాదా
నీకు నీవు గురువు కావా.
నీకు నీవుగా నేర్చుకున్నది ఏమీలేదా.
పుస్తకాలు గురువులు కావా.
లేక
జీతాలు తీసుకుని
పని రోజుల్లో పాఠాలు చెప్పే వాళ్ళు మాత్రమే గురువులా.
మూఢ నమ్మకాలు బోధించే
నిరక్షర యోగులు ,స్వామిజీలు
మాత్రమే మనకు గురువులా .
పుక్కింటి పురాణాలను
వల్లే వేసేవారు గురువులా.
ప్రతి
సజీవ మరియు
నిర్జీవ వస్తువూ
ప్రతి భావమూ
ప్రతి దృశ్యమూ గురువులే.
ప్రతి గురువూ ఒక శిష్యుడే
ప్రతి శిష్యుడూ తన గురువుకు
ఒక గురువే.