What? Why? (Poetry)
ఏం? ఎందుకని ?
నిలువెల్లా గాయాలు చేసినా
పిల్లన గ్రోవి పాటనిస్తుంది
బంగారాన్ని పుటం పెట్టినా
నగగా మారి నవ్వుతుంది
మట్టిని నాగలితో దున్నినా
ఆకలి తీర్చే అన్నమిస్తుంది
బట్టను కత్తెరతో కత్తిరించినా
అది మన ఒళ్ళుకప్పుతుంది
ప్రకృతిని ఎంత చిదిమినా
నిత్యం బతుకును పంచుతుంది What? Why? (Poetry)
వెలుగును మింగిన చీకటి
తన తప్పు తెలుసుకొని
ఉదయాన్నే వెలుగును
తిరిగి ఇచ్చేస్తుంది
ఒక్క మనిషి మాత్రమే
చేసిన మేలు మరుస్తాడు
గుండెను ముక్కలు చేసి
వినోదిస్తూ వుంటాడు
ఏం? యెందుకని ?
ఎ.రజాహుస్సేన్
హైదరాబాద్