What is patriotism poetry దేశభక్తి అంటే కవిత్వం

What is patriotism
దేశభక్తి అంటే..

వ్యక్తి పూజ కాదు దేశభక్తి అంటే
స్వార్థానికి సమాధికట్టి
సాటి మనిషికి సాయపడుతూ
సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ సాగిపోవడమూ దేశభక్తే

విభజిస్తూ పాలించడం కాదు దేశభక్తి
కులమతాల పెనుగులాటలను కూకటి వేళ్ళతో పెకిలిస్తూ
కుచించుకుపోతున్న మనస్తత్వాన్ని విడిచిపెట్టి
మానవత్వమే మన మతమని మనమంతా ఒక్కటని
భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ
జాతి గర్వించదగిన వ్యక్తిగా మిగిలిపోవడమూ దేశభక్తే

విర్రవీగిన అహంకారము తోడై విచ్చలవిడితనంతో
మత్తులో మునుగుతూ మైమరిచి పోవడం కాదు దేశభక్తి
దేహమే కాదు దేశం కూడా నాదన్న భావన కలగాలి

రైతు బ్రతుకు ఇప్పుడు పరారీలో వుంది
ఉరికొయ్యల శిరసులకై ఊగిసలాడుతోంది
రంగుపులుముకున్న రాజకీయాలు
ఇప్పుడు శవాల వాసన మోస్తున్నాయి

ఛిద్రమౌతున్న మనిషి గుండె గొంతుకు చికిత్స అవసరమిప్పుడు
శిథిలమౌతున్న మానవత్వానికి కొత్త మెఱుగులు దిద్దుకోవలసిందే
నేనూ నాదేశమన్న నినాదం నింగిని తాకేలా…

మచ్చరాజమౌళి
దుబ్బాక, 9059637442

What is patriotism poetry / zindhagi.com / ytakarla mallesh
Comments (0)
Add Comment