బెహ్రాన్ లో మరణించిన శ్రీనివాస్ బాడి కోసం నిరిక్షణ..

డబ్బుల కోసం గల్ఫ్ దేశం వెళ్లి

శవాలుగా ఇంటికి..

నిజామాబాద్, మార్చి 25 : అతను ఉన్న ఊళ్లో  బ్రతుకు తెరువు లేక డబ్బుల కోసం గల్ఫ్ దేశం వెళ్లాడు. వాతవరణ మార్పు వల్ల వచ్చే ఆనారోగ్యంతో మృతి చెందాడు యాటకర్ల శ్రీనివాస్. చివరి చూపు కోసం అతని బాడీ కోసం వారం రోజులుగా రోదిస్తూ నిరిక్షిస్తోంది కుటుంభీకులు, బంధువులు. 

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం పడఖల్ గ్రామానికి చెందిన యాటకర్ల శ్రీనివాస్ (48) పుట్టిన ఊళ్లో ఉపాధి లేదని బెహ్రాన్ వెళ్లాడు. ఆర్థిక సమస్యలను అధిగ మించడానికి పొద్దంతా కష్ట పడ్డాడు. జెసీబి ఆఫర్ టర్ గా పని చేసే  అతనిని హార్ట్ అటాక్ రూపంతో మృత్యువు కబళించింది. శ్రీనివాస్ చావు వార్త తెలిసిన భార్య కళావతి, ఇద్దరు కూతుర్లు, కుమారుడు రోదిస్తున్నారు.

మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే అని మార్క్స్ చెప్పిన మాట నిజమే.. పడఖల్ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనోపాది గడించే యాటకర్ల శ్రీనివాస్ తన ఇద్దరు కూతుర్లు, కుమారుడిని పెంచి పెద్ద చేయడానికి చాలా ఏళ్ల క్రితం వీసా కోసం మరీ అప్పులు చేసి బెహ్రాన్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ డబ్బులు సంపాదిస్తుంటే సంతోష పడ్డారు. అతను కష్ట పడి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ప్రదీప్ పెళ్లిళ్లు చేశారు. కుటుంబం సంతోషంగా ఉందని భావించిన శ్రీనివాస్ తొమ్మిది నెలల క్రితం ఇంటికి సెలవుపై వచ్చి వెళ్లాడు.

అయినా.. పని చేస్తూ మంచిగానే ఉన్న శ్రీనివాస్ వారం రోజుల క్రితం తన గదితో తోటి కార్మికులతో ఉన్నప్పుడు చాతీలో నొప్పి వచ్చింది. దేశం కాని దేశంలో అక్కడా ఉంటే వాళ్లంతా శ్రీనివాస్ లా గల్ఫ్ దేశం వలస వెళ్లిన వాళ్లే.. ఇంట్లో ఉన్న ఏవోొ మెడిసిన్ వేయించి వాళ్లంతా పనులకు వెళ్లారు. అంతే.. సాయంత్రం వచ్చే వరకు శ్రీనివాస్ విగత జీవిగా పడి ఉన్నారు.

శ్రీనివాస్ మరణ వార్తను కుటుంభీకులకు తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. శ్రీనివాస్ కుమారుడు ప్రదీప్ కూడా ఉన్న ఊళ్లో ఉపాధి లేదని తండ్రి శ్రీనివాస్ బాటలోనే మాల్లీదువులకు వలస వెళ్లాడు. తండ్రి మరణ వార్త తెలిసి చివరి చూపుల కోసం ఇంటికి తిరిగి వచ్చాడు.యాటకర్ల శ్రీనివాస్ బాడీ కోసం రోదిస్తూ రోజుల తరబడి నిరిక్షిన్నారు కుటుంభీకులు, బంధువులు.

ప్రభుత్వ హామి ఏమైంది..???

బ్రతుకు తెరువు కోసం గల్ప్ దేశాలు వెళ్లిన వారిని ఆదుకుంటామని ప్రభుత్వం ఇస్తున్న హామిలు అమలు కాలేదు. ఇగో శ్రీనివాస్ లా గల్ఫ్ దేశాలు వెళ్లి మరణించిన కుటుంభీకులు అనాధలుగా మారుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయినా.. ఇప్పటికీ అతని హామి అమలు కాలేదు.

 

Waiting for the body of Srinivas who died in Behran..
Comments (0)
Add Comment