విన్సన్ట్ ఫాదర్ ఫెర్రర్ 101వ జయంతి

AP 39TV 09ఏప్రిల్ 2021:

విన్సన్ట్ ఫాదర్ ఫెర్రర్ 101వ జయంతి సందర్బంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘననివాలు అర్పించి అయన చూపించినమార్గం బడుగు బలహీన వర్గాల తో పాటు ఇతరులకు మాటలకంటే ఫెర్రర్ స్ఫూర్తి ని మనం ముందుకు తీసుకెళ్లిన రోజే ఆయనకు ఘననివాళి అని సామ్రాట్ కె.బి.మధు తెలిపారు.ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఖండాంతరాలు దాటి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్న SC, ST నిరుపేద వర్గాలకు విద్యా,ఉద్యోగ,స్థిరనివాసం, సంక్షేమ తదితర అంశాలపై అవగాహనకలిగిన ఫాదర్ ఫెర్రర్ ప్రభుత్వం తో పాటు RDT సంస్థ ద్వారా వేలాది కుటుంబాలకు సహాయ సహకరాలు అందిస్తూ ఇటు ప్రజలకు అండగా విద్యా వైద్యం తో మొదలు పెట్టి, సంక్షేమ ఆర్థిక రంగాలలో ఎదిగే విదంగా పథకాలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబాన్ని అభిరుద్ది చేస్తూ వ్యవసాయం, క్రీడా రంగాలతో పాటు ప్రతి రంగంలోనూ ప్రావీణ్యం సంపాటించుకొనే విదంగా బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు ఆర్థికంగా వెనుకపడిన అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ మకుటం లేని మహారాజు గా ఫెర్రర్ పేదల గుండెల్లో గుడి కట్టుకొన్న ప్రత్యక్ష దైవంగా కొలువబటం ఆయన కీర్తి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న గొప్ప మహానుభావులు అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో Mrps నాయకులు సామ్రాట్ కె.బి.మధు, skuతిరుపాల్, జయప్రకాశ్, రవీంద్ర, KDSరాజు,సాంబా, నిషార్ అహమ్మద్,
Jcs నాయకులు జి.కె.రామన్న,వలి,సూరి,లతో పాటు కాంగ్రెస్ శంకర్,
Ngo ప్రసిడెంట్, బ్యాంక్ క్రిష్ట్న మూర్తి, ఆర్ట్స్ కాలేజ్ మాజీప్రిన్సిపాల్,రంగస్వామి, నాగలింగయ్య, rdt రామాంజి తదితరులు పాల్గొన్నారు.

 

Comments (0)
Add Comment