V6 News TV CEO Ankam Ravi Award V6 CEO అంకం రవికి అవార్డ్

V6 News TV CEO Ankam Ravi Award
#GameChangersAward #MediaNews4u #V6News

 కంగ్రాట్స్ బాస్ అంకం రవి సార్…

ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన V6 న్యూస్ టీవీ వ్యవస్థాపక ఎడిటర్ ఇన్ చీఫ్ మరియు CEO అంకం రవి గారికి అరుదైన అవార్డ్ లభించింది. తెలంగాణ యాష, భాషలో ప్రజల మనోభావాలకు అనుకులంగా వార్త కథనాలు అందచేసిన అంకం రవి గారు medianews4u.com నుండి 2021 కొరకు “గేమ్ ఛేంజర్” అవార్డును పొందారు. medianews4u.com సౌత్ న్యూస్ మీడియా విభాగంలో రవి గారు ఎంపికయ్యారు. “గేమ్ ఛేంజర్” అవార్డును అందుకున్న ఎడిటర్ ఇన్ చీఫ్ మరియు CEO అంకం రవిది నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మిట్టపల్లి గ్రామం.

తెలంగాణ ఉద్యమం..

వీ6 న్యూస్ ఛానల్ 1 ఏప్రిల్ 2012లో ప్రారంభమై పదేళ్లు గడిసింది. తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకుని ప్రజలను ఉద్యమం పట్ల ఆలోచింప చేసే ప్రోగ్రాంలను వీ6 అంద చేసింది. వీ6 న్యూస్ కు అన్నీ తానై ఒకే ఒక్కడుగా నడిపిన రవి గారిని ఎన్నో అవార్డులు స్వాగతం పలికాయి. డజన్ కు పైగానే టీవీ న్యూస్ ఛానెల్స్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో టాఫ్ రేటింగ్ లో నిలిసింది వీ6 న్యూస్ ఛానెల్.

ఒకే ఒక్కడుగా..

ముప్పయి మూడు ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో కొనసాగిన అంకం రవి ప్రాక్టీకల్ గా ఆలోచిస్తాడు. ప్రజల ఆలోచనకు దగ్గట్లుగా వార్త కథనాలు ఇవ్వడంలో దిట్ట. ఈనాడు, ఆంధ్రభూమి, దక్కన్ క్రానికలతో పాటు సూర్య లాంటి దిన పత్రికలలో నెట్ వర్క్ ఇన్ చార్జీగా పని చేసిన అంకం రవికి ప్రింట్ మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉంది.

ఎలక్ట్రానిక్ మీడియా..

2009లో ప్రారంభమైన ఐ న్యూస్ ఛానెల్ లో ఇన్ పుట్ ఎడిటర్ గా కొనసాగిన అంకం రవి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తన సత్తా చూపించారు. ఆ సందర్బంలోనే తెలంగాణ ఉద్యమానికి టీవీ న్యూస్ ఛానెల్ అవసరాన్ని గుర్తించారు అంకం రవి. VIL మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంను ఒప్పించి V6 న్యూస్ ఛానెల్ ప్రారంభించారు. తెలంగాణ భాష, యాస మరియు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మాండలిక వార్త కథనాలను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసాడు. తెలంగాణ రాష్ట్రంలోనే తీన్మార్ వార్త కథనాలు పూర్తిగా పల్లెటూరి బాష యాషలో ఇవ్వడంతో వీ6 న్యూస్ ఛానెల్ ను ప్రజలు తమదిగా భావించారు.

వీ6 న్యూస్ ఛానెల్..

భారత దేశంలోనే తీన్మార్ వార్తలకు పాఠకుల ఆధరణ పెరుగింది. తీన్మార్ వార్త కథనాలుగా టీవీ 9, హెచ్ ఎంటీవీ, సాక్షీ లాంటి న్యూస్ చానెల్స్ వీ6 న్యూస్ తీన్మార్ వార్తలు లాగే తెలంగాణ యాష బాషలో వార్త కథనాలు ఇస్తున్నాయి.

యాంకర్స్..

V6 న్యూస్ టీవీ వ్యవస్థాపక ఎడిటర్ ఇన్ చీఫ్ మరియు CEO అంకం రవి ఆలోచనతో ప్రత్యేకంగా శిక్షణ పొందిన యాంకర్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా తీన్మార్ వార్త కథనాలు రాసే స్ర్కిప్ట్ రైటర్స్, యాంకర్ లకు అదనంగా వేతనాలు ఇచ్చి వీ6 న్యూస్ ఛానెల్ ను దెబ్బ తీయడానికి కుట్రలు జరిగాయి. అయినా.. ఒకరు పోతే మరోకరిని తయారు చేసిన అంకం రవి వీ6 ను నెంబర్ వన్ స్థానంలో నిలిపాడు. టీవీ 9యాంకర్ సావిత్రి, సాక్షి యాంకర్ బిత్తిరి సత్తి, క్యూ న్యూస్ సిఇవో తీన్మార్ మల్లన్న, హెచ్ ఎంటీవి యాంకర్ సుజాత ఇగో చాలా మంది వీ6లో పని చేసి వెళ్లిన వారే..

“గేమ్ ఛేంజర్” అవార్డు

#GameChangersAward #MediaNews4u #V6News

V6 News Receives National Award in South News Media Category | Game Changers Awards -2021 | V6 News

ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రజల మన్ననలు పొందుతున్న వీ6 న్యూస్ ఛానెల్ కు ఏప్రిల్ 22 న చెన్నైలో జ‌రిగిన మెరిసే కార్య‌క్ర‌మంలో మీడియా న్యూస్4యు.ఓమ్, ఈవెంట్‌ లో “గేమ్ ఛేంజర్” అవార్డును అందజేసింది. అంకం రవి తరపున వీ6 ఛానెల్ ప్రతినిధి శంకర్ ఈ అవార్డును అందుకున్నారు. దాని ఉల్లేఖనంలో, హోస్ట్ medianews4u.com రవి మరియు అతని బృందాన్ని అభినందించింది.

కంగ్రాట్స్ …
దక్షణ భారత దేశంలోనే “గేమ్ ఛేంజర్” అవార్డును అందుకున్న ఎడిటర్ ఇన్ చీఫ్ మరియు CEO అంకం రవి, వీ6 న్యూస్ ఛానెల్ మేనేజి మెంట్ మరియు ఉద్యోగులకు కంగ్రాట్స్…

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

V6 News TV CEO Ankam Ravi Award / ankam ravi / zindhagi.com / yatakarla mallesh / v6 news
Comments (1)
Add Comment
  • Ballaniraj

    Ravi sir journalist editor ceo
    Ga panichesi my friend best wishes