Today’s election style నేటి ఎన్నికల  తీరు..

Today’s election style

నేటి ఎన్నికల  తీరు..

100 మంది సామర్ధ్యం గల ఒక హాస్టల్ నందు ప్రతిరోజూ ఉదయం టిఫిన్ లో ఉప్మా ను వడ్డించేవారు. ఆ 100 మందిలోని 80 మంది మాత్రం ఉప్మా కాకుండా భిన్నమైన టిఫిన్ ను చేసి పెట్టాల్సిందిగా ప్రతిరోజూ ఫిర్యాదు చేసేవారు. కానీ… మిగతా 20 మంది మాత్రం ఉప్మా తినడానికి సంతోషంగా ఉండేవారు. మిగతా 80 మంది మాత్రం ఉప్మా కాకుండా మరేదో ఒకటి వండి పెట్టాల్సిందిగా కోరేవారు.

ఈ గందరగోళ పరిస్థితిలో ఎదో ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి ఆ హాస్టల్ వార్డెన్ వోటింగ్ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం ఏ టిఫిన్ కైతే ఎక్కువ ఓట్లు వస్తాయో, ఇక రోజు ఆ టిఫిన్ నే వండి పెట్టడం జరుగుతుంది. ఉప్మా కావాలి అనుకున్న 20 మంది విద్యార్థులు తమ ఓటును ఖచ్చితంగా వేశారు. మిగతా 80 మంది మాత్రం ఈ క్రింది విధంగా తమ ఓటును వేయడం జరిగింది. 18 – మసాలా దోసా, 16 – ఆలూ పరోటా & దహి, 14 – రోటి & సబ్జి, 12 – బ్రెడ్ & బట్టర్, 10 – నూడుల్స్, 10 – ఇడ్లీ సాంబార్కావున…. Today’s election style

ఓటింగ్ ఫలితాల ప్రకారం, ఉప్మా కు అత్యధిక ఓట్లు పడటం వలన, మరలా అదే ప్రతి రోజు వడ్డించబడుతుంది.గుణపాఠం: 80% జనాభా స్వార్ధంతో, విభజించబడి, చెల్లాచెదురై దిక్కులు చూస్తున్నంత కాలం, 20% మనల్ని పాలిస్తూ ఉంటుంది.  ఇదొక నిశబ్ద సందేశం.

దురిశెట్టి నరసింహచారి, జర్నలిస్ట్

Today's election style/ zindhagi.com
Comments (0)
Add Comment