నగరపాలక సంస్థ సిబ్బందికి కోవిడ్-19 వాక్సినేషన్

ఏపీ 39టీవీ 11 ఫిబ్రవరి 2021:

నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ భవనం లో బుధువారం నగర పాలక సంస్థ ఉద్యోగుల కు కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి వాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు .ఈ వాక్సినేషన్ కార్యక్రమమానికి సిబ్బంది వాక్సినేషన్ వేయుంచుకోవాడానికి సందేహించడం గమనించిన కమీషనర్ పి వి వి ఎస్ మూర్తి ,తానే స్వయంగా సిబ్బందిని వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న ప్రదేశానికి పిలిపించి వ్యాక్సిన్ ప్రక్రియలో ఎటువంటి సందేహాలు వద్దని మొట్టమొదట కమిషనర్  వ్యాక్సిన్ వేయించుకొని మిగతా సిబ్బందికి మనోధైర్యాన్ని నింపుతూ వారి తో అరగంట పాటు అక్కడే ఉండి సిబ్బందికి ప్రోత్సాహం నింపుతూ మరియు వ్యాక్సినేషన్ పై ఎటువంటి అపోహలు వద్దు అని చెప్పారు.. ఈ సమయంలో కమిషనర్ ని కలవడానికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలను విని సంబందిత అధికారులకు తగు చర్యలు చేపట్టాలని చెప్పడం జరిగినది.నేటి వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉండి రాని సిబ్బందికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతూ టీకా వేయించుకోవాలని ఆదేశించడం జరిగినది కమిషనర్  సందేశం మేరకు సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం సంతోషకరమని కమిషనర్ తెలిపారు.నేడు నిర్దేశించబడ్డ నగర పాలక సిబ్బంది మొత్తం కమిషనర్  అదేశాల మేరకు కోవిద్ 19 టీకా వేయించుకుని నగరపాలక సిబ్బంది కరొన నియంత్రణకు ఎల్లవేళలా ముందుంటారని ఈ సందర్భంగా మరొకసారి రుజువు చేసారని గుర్తుచేస్తూ తదుపరి కమిషనర్ తమ విదులను యధావిధిగా కొనసాగించడం జరిగినది.ఆరోగ్య అధికారైన డాక్టర్ రాజేష్ , ఎ ఎస్ ఒ ప్రవీణ్ కుమార్ వాక్సినేషన్ కార్యక్రమమును కొనసాగించలని అదేశించారు.

 

Comments (0)
Add Comment