13న తిరుమల ప్రవేశ దర్శనం కోసం
ఆన్ లైన్ లో టిక్కెట్లు
తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ కోటా టికెట్లు ఈనెల 13న ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను తితిదే విడుదల చేయలేదు.
బాలాలయం కార్యక్రమం వాయిదా పడటంతో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు నిలిపివేసిన టికెట్లను సోమవారం విడుదల చేయనున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు.
మార్చి నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్ల కోటాతో పాటు ఈనెల 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీని నిలిపివేశామని తితిదే పేర్కొంది.
ప్రస్తుతం ఆ టికెట్లను కూడా శనివారం ఉదయం11 గంటలకు విడుదల చేస్తునట్టు తెలిపింది.