Tiranga Muslim (poetry) తిరంగా ముసల్మాన్ (కవిత్వం)

Tiranga Muslim (poetry)
తిరంగా ముసల్మాన్ (కవిత్వం)

ధర్మచక్రాన్ని ధరించిన వాడ్ని
మూడురంగుల్లో మునిగిన వాడ్ని
సరిహద్దుల్లో హిమనగాన్ని మోస్తున్న వాడ్ని
అల్లా పేర మారణహోమం జరిపే
కాఫిర్ల పాలిట ఖబర్దార్ని…!

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా
అల్లాహో అక్బర్ అజా ధ్వనిని….
వందేమాతరం గీతానికి రసధ్వనిని

నా తాతల రక్తం ఇంకింది ఇక్కడే
నా తరాల త్యాగాలు జెండాలైందీ ఇక్కడే

మేరా జబాన్ హిందూస్తానీ
మేరా ఇమాన్ హిందూస్తానీ
మై హూ తిరంగా ముసల్మాన్….!!

ఎ.రజాహుస్సేన్.!!

మిత్రులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!!
(చిత్రం…నందు)

Tiranga Muslim (poetry) / zindhagi.com / yatakarla mallesh / abdul rajahussen
Comments (0)
Add Comment