ఈ ఫోటో నా హృదయాన్ని ముక్కలుగా చేసింది

నా హృదయాన్ని

ముక్కలుగా చేసిన ఫోటో ఇదే..?

అడవుల మధ్య స్వేచ్ఛగా జీవించే జంతువులకు కష్టాలు తప్పవెమో..?

ఏదోె కౄరమృగం దాడి చేసి చంపేయచ్చు.

కానీ.. ఈ ఫోటో నా హృదయాన్ని ముక్కలుగా చేసింది.

మితృడు సందీప్ వాట్సాప్ లో ఈ ఫోటో పంపుతూ జర్నలిస్ట్ గా  మెస్సెజ్ రాయుమన్నాడు.

ఆ ఫోటో దుప్పి కళేబారాన్ని చూస్తుంటే

ఆ ఫీలీంగ్ ను అక్షరాలలో రాయలెనెమో..

ఆ రాళ్ల మధ్యకు ఎందుకు వెళ్లిందో.. అలా ఎలా ఇరుక్కుందో.,.

బండ రాళ్ల మధ్య నుంచి బయటకు రాలేక

ఎన్ని రోజులు నరకం అనుభవిస్తూ..

విల విలలాడుతూ ఎలా  ప్రాణం పోయిందో ఆ ప్రాణిది….???

మనిషి జీవితం కూడా…

క్షణం.. క్షణం ప్రాణ భయమే. మానవత్వం లేని సమాజంలో మనిషి బతుకడం కష్టమే..

కరోనా ప్రపంచాన్ని కాటేసిన తరువాత బీమారైతే బతుకాలేమానే భయం మనలో ఉంది.

ఈ సృష్టిలో ‘చావు’ను తప్పించుకునే వారే లేరు.

అయినా.. నీది నాదీ అంటూ టెన్షన్ వైపు పరుగులు పెడుతున్నాం.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

This photo broke my heart / animal lover / Yatakarla Mallesh / zindhagi.com / thewidenews.com / animal telangana
Comments (0)
Add Comment