Think Senior Citizens సీనియర్ సిటిజన్స్ ఆలోచించండి

Think Senior Citizens
సీనియర్ సిటిజన్స్ ఆలోచించండి

ఆరువై ఏళ్లు దాటగానే అమ్మో.. అయ్యో అంటారు సీనియర్ సిటిజన్స్. అడుగు తీసి అడుగు వేయాలంటే కీళ్ల నొప్పులు. కొంత సేపు కూర్చుండి లేసి నడువాలంటే చాలా కష్టం అంటున్నారు. అయినా.. ఆ కష్టంతో నడువాల్సిందే. ఇటీవల యునైటెడ్ స్టేట్ లో సీనియర్ సిటిజన్స్ పై అద్యాయం చేశారు. వృద్దాప్యంలో బాధపడటానికి కారణం 51 శాతం మెట్లు ఎక్కడం వల్లేనని అద్యాయనంలో తేలింది. మెట్లు ఎక్కుతున్నప్పుడు బ్యాలెన్స్ ఔట్ అయి పడి పోయి మరణించిన సంఘటనలు ఉన్నాయి.

ఆరువై ఏళ్ల తరువాత

ముఖ్యంగా ఆరువై ఏళ్ల తరువాత కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని సీనియర్ సిటిజన్స్ కు సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు. సింగల్ గా మెట్లు ఎక్కక పోవడం బెటరంటున్నారు వైద్యులు. ఒకవేళ తప్పని సరి ఎక్కాలనుకుంటే మెట్ల కేసు రైలింగ్‌లను పట్టుకొని ఎక్కాలంటున్నారు. ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు తలను వేగంగా తిప్పవద్దు. ఒక వేళ కళ్లు బైర్లు కమ్మితే నేలపై పడి పోయే ప్రమాదం ఉందంటున్నారు. కూర్చుండి డ్రెస్ వేసుకోవాలంటున్నారు. పడుకునే సమయంలో కూర్చుండి స్లోగా పడుకోవాలంటున్నారు.

గుండె నిబ్బరంతో

వ్యాయమానికి ముందు శరీరాన్ని సిద్దం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో వెనక్కి నడువద్దంటున్నారు. బరువు ఎత్తడానికి నడుం వంచద్దు. మంచంపై నుంచి నిదానంగా లేవచ్చంటున్నారు. చురుకుగా ఉండాలంటే నవ్వుతూ కాలం వెళ్ల తీయలంటున్నారు. కష్టాలు వచ్చిన గుండె నిబ్బరంతో ఉండాలంటున్నారు వైద్యులు.

– డాక్టర్ శ్రీనివాస్

Think Senior Citizens / zindhagi.com /yatakarla mallesh
Comments (0)
Add Comment