అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ భూసార పు సత్య యేసు బాబు గారి ఆదేశాల మేరకు అనంతపురము DSP శ్రీ వీర రాఘవ రెడ్డి గారి ఆద్వర్యములో, అనంతపురము టౌన్ నందు ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న ద్విచక్ర వాహనముల వరుస దొంగతనముల పై అనంతపురము 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ పి జాకీర్ హుస్సేన్ ఖాన్ గారు వారి SI లు రాంప్రసాద్, రాఘవరెడ్డి, అల్లా బకష్, జయరామ్ నాయక్ మరియు సిబ్బంది రంజిత్, షఫీ, సుధాకర్, తిమ్మప్ప, రఘునాయక్, హెడ్ కానిస్టేబుల్ ఖాదర్ మోటార్ సైకిల్ దొంగతనములపై ప్రత్యేగా నిఘా వుంచి ఈ దినము అనగా 21.03.2021 వ తేది ఒక దొంగను అరెస్ట్ చేసి అతని నుండి ,6,58,000/- విలువ చేసే 10 మోటార్ సైకిల్స్ ను స్వాదీనపరచుకోని రిమాండ్ కు తరలించడం అయినది.