There can be no peace with terrorists
తీవ్రవాదులతొో ప్రశాంతాత ఉండదు
ఉన్మాదుల కలల భూమి
ఎప్పుడూ ప్రశాంతం కాదు
ఒక తలువు తీసినప్పుడు
ఏదో ఒక శతగ్ని గుండెని చీల్చన్నప్పుడు
ఒక కిటికీ తీసినప్పుడు
ఒక పచ్చని చెట్టు నవ్వినప్పుడు
కదా.. లోకమంటే.
వెతుకుతున్నప్పుడు
దొరికే నవ్వు అద్భుతం
అన్వేషించేప్పుడు
దొరికే దారి అద్బుతం.
ఉన్మాది కలల భూమిగా
ఏ నేలా శాంతిగా వుండదు.
కన్నీళ్ల సంద్రాన బేలాగా
ఏ బిడ్డా….ఉండకూడదు.
మన ఆకాశపు ముక్కల మీద
ఒలుకుతున్న నెత్తురు వాసన
మనది కాకుండా పోవడమే
మన శవం మీద కప్పిన కఫన్.
స్వేచ్చా గీతాలకు సమాధి కడుతో
కుహనా మర్యాద ప్రపంచం విస్తరిస్తోంది.
జాతుల అస్తిత్వాన్ని గేలి చేస్తూ
వంచనా ముఖం పెట్రేగిపోతోంది.
పసి పిల్లల పసిమి కళ్ళల్లో
విద్వేష గీతాలు రాసే
విషపు జాతి పతనం కాక తప్పదు.
న్యాయం
విధిగా మేలుకునే రోజుల్లో
శిశువుల కన్నీళ్ల కలలు సదా ఫలిస్తాయి.