ఎన్ సి సి అడ్మిషన్ల ప్రక్రియను వాయిదా వేయాలి : ఏఐఎస్ఎఫ్

డిగ్రీ అడ్మిషన్లు పూర్తికాకనే ఎన్ సి సి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడం సరికాదు,
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
(అనంతపురము జిల్లా, సిటీ)
డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాకమునుపే ఎన్ సి సి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడం సరికాదని సోమవారం నాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ నాగలింగ రెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ఎన్ సి సి అడ్మిషన్ల ప్రక్రియను తక్షణం వాయిదా వేయాలని డిమాండ్ చేశారు, డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాకమునుపే ఎన్ సి సి అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు, అత్యధిక మంది విద్యార్థులు ఎన్ సి సి లో శిక్షణ పొందేందుకు కళాశాలలో చేరడానికి ఆసక్తి చూపే వారు ఉన్నారని అలాంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలి తప్ప ఇష్టానుసారంగా ఎన్ సి సి షెడ్యూల్ను విడుదల చేయడం సరికాదన్నారు, విద్యార్థులకు అనుగుణంగా పరిపాలన విభాగం కొనసాగించాలని ఒంటెద్దు పోకడలు విద్యార్దుల పైన ప్రయోగించడం సరికాదని అన్నారు, భవిష్యత్తులోనైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని అలా లేని పక్షంలో విద్యార్థులకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న వాటిపైన ఉద్యమాలకు శ్రీకారం చూడుతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుల్లాయి స్వామి జిల్లా ఆఫీస్ బేరర్స్ రాజేంద్ర, రమణయ్య, నగర నాయకులు మోహన్, నారాయణస్వామి, సాయి, అరుణ్ నాయక్, శంకర్, బాబా, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

 

Comments (0)
Add Comment