అస్కార్ అవార్డు.. సక్సెస్ తోనే ఈ అవార్డు వచ్చిందని చెబుతారు. కానీ సీనియర్ జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డి మాత్రం ఇండియా 2028లో నంబర్ వన్ దేశం కావాలంటే ప్రాంత, కుల, మతం పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం, ఉద్యోగ కార్పోరేట్ వ్యవస్థ నాశనం కావాలని కోరుకుంటారు. అస్కార్ అవార్డు గురించి అతని అభిప్రాయం అక్షరాలలో..
- యాటకర్ల మల్లేష్
అస్కార్ మెచ్చినా అనాథాలనే హార్డ్ వర్కర్స్.
దేవేందర్ రెడ్డి
జస్ట్ జర్నలిస్ట్.
9848070809.
ఇండియా సినిమాలకు అస్కార్ అంటే ఓ అద్బుతం. ఎందుకంటే టాలెంట్ కి ఇక్కడ విలువ ఉండదు. కులం , మతం, ప్రాంతం అన్ని ఉంటేనే అస్కార్ వచ్చినా.. అంతరిక్షంలోకి వెళ్లినా విలువ ఉంటుంది. ఏ కేటగిరి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది. మూలాలు ఏంటీ అనేది ప్రచారంలో ఉండదు.
ఒక్కరు గుజరాతి మూవీ అని నామినేట్ చేస్తే.. మరోక్కరు మా కులం వారు ఉన్నారు కాబట్టి ప్రచారం వారికే అంటారు. కలర్ ఫుల్ ప్రపంచంలో కష్టం ఒకడిది.. పేరొక్కరికి వెళ్లుతుంది. బి.ఎన్ .రెడ్డి నుంచి ఇప్పటి చంద్రబోస్ వరకు తెలుగు సినిమా ప్రపంచం ఓ ప్రాంతానికి ఇచ్చిన విలువ ఇవ్వదు. ప్రచారం చేసిన ఒప్పుకోరు. అన్నిట్లో మేమే ముందు అంటారు. అసలు విషయం ఏంటో అస్కార్ లోని ఫోటో పోజులతోనే తెలిసిపోతుంది.
ఏ మీడియా చూసిన సోషల్ మీడియా పోస్టులు చూసినా ఆంధ్ర ప్రాంతం వారికే ప్రాధన్యత. అస్కార్ అవార్డ్ తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది అని ఏ ఒక్కరు చూపించలేదే.. ?
ఇలా అంటే ఆలాంటి మేధావికి అవకాశాలు ఇవ్వని సమాజం మనది . తెలంగాణ టాలెంట్ ని ఆంధ్ర వాళ్లు తొక్కెస్తున్నారు అంటే.. ఆంధ్ర వారిని తమిళ్ వాళ్లు నొక్కెశారు. సౌత్ ఇండియా అంటే.. నార్త్ ఇండియా అని వస్తుంది. అన్నింటికి గుజరాత్ అంటారు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. దక్షిణాది వారు ఏనుగు మీద ప్రేమ పంచుకున్న వారి పై పొట్టి సినిమా తీస్తే అది అస్కార్ కి ఎలా వచ్చిందని కోపం పెట్టుకున్న నార్త్ ఇండియా వారు ఉన్నన్ని రోజులు ఇలానే ఉంటుంది.
టాలెంట్ ఎంత ఉన్నా.. ఇలాంటి కుట్ర పూరిత అలోచనలతో .. అది ఊరి వరకే నిలిచిపోయిన వారి జీవితాలు ఎన్నో.. ఇండియా 2028లో నంబర్ వన్ దేశం కావాలంటే .. ప్రాంత, కుల, మతం పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం, ఉద్యోగ కార్పోరేట్ వ్యవస్థ నాశనం కావాలి.