ఆంధ్ర ప్రధేశ్ లో రాజకీయాలు ఆగమ్యగోషరంగా మారాయి. ప్రతి పక్షలను ప్రజల తిరుగకుండా జగన్ సర్కార్ జీవోల పేరిట అణచడానికి కుట్రలు చేస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఎవరికి వారే రాజకీయ లబ్ది కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు.
తాజా రాజకీయ పరిస్థితులు నువ్వా-నేనా అనేంత స్థాయికి వెళ్లాయి.
టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్రజాస్వామిక విధానంను ప్రజలకు వివరించడానికి ఇటీవల ప్రజల వద్దకు వెళ్లే ప్రోగ్రాం పెట్టుకున్నారు.
న్యూ ఇయర్ లో జీవో 1 తీసుక వచ్చింది ప్రభుత్వం.
అంతే బహిరంగ సభలు.. ర్యాలీలు తీయ కూడదనే ఆ జీవోను అమలు చేయడానికి పోలీసులు పొలిటికల్ లీడరులను అడ్డుకుంటున్నారు.
నారా చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజక వర్గం కుప్పం వెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడుగడుగున అడ్డు పడ్డారు. నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జీవో 1 లాంటి నీచమైన జీవోలు తెచ్చి ఉంటే నాడు పాదయాత్ర చేసేవాడివా..? అంటూ ప్రశ్నించారు. త్వరలో ప్రజల వద్దకు వెళ్లడానికి సిద్దమవుతున్న జననేత పవాన్ కళ్యాన్ కూడా సీఎం జగన్ పై మండి పడ్ప్రడారు.