The original..Like me.. Are you there Or not?
సదసత్సంశయం !!
నాలో నేను
నేను నాలో
అసలు…
నేనంటూ..
ఉన్నానా?
లేనా?
లేనిది వుందా!
వున్నది లేదా?
గాలి వీస్తుంది
తేలిపోతుంది
ఏదీ కనబడదే?
నిప్పు రగుల్తుంది
దహించుతుంది
తీరా ఆరిపోతుంది
చివరకు మిగిలేది?
వర్షం కురుస్తుంది
నీరు ప్రవహిస్తుంది
నీరు గడ్డ కడుతుంది
నీరు ఆవిరైపోతుంది
కంటికి కనిపించదేం?
చిలక్కొయ్యకు వేలాడే
మాసిన చొక్కా….
ఉతికితే పోయేదేంటి?
పంజరం చిలక్కోసమా?
చిలక పంజరం కోసమా?
ఎవరు దేనికోసం?
చిలక ఎగిరాక
ఇక పంజరందేనికి?
ఎ.రజాహుస్సేన్
నంది వెలుగు